Advertisementt

నాకు సపోర్ట్ లేదంటూ ఏడుస్తున్న టేస్టీ తేజ

Tue 26th Nov 2024 01:16 PM
tasty teja  నాకు సపోర్ట్ లేదంటూ ఏడుస్తున్న టేస్టీ తేజ
Tasty Teja crying that I have no support నాకు సపోర్ట్ లేదంటూ ఏడుస్తున్న టేస్టీ తేజ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ కి మెగా చీఫ్ దగ్గర నుంచి ప్రతి టాస్క్ లో గెలుపు అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. మొన్నటికి మొన్న మెగా చీఫ్ రేస్ లో విష్ణు ప్రియ తేజ గ్లాస్ లు పడేసి పక్కకు తప్పించింది. ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్ లోను తేజ ఓడిపోవడంతో ఎమోషనల్ అయ్యాడు. 

ఫ్యామిలీ వీక్ లో అమ్మ కావాలి అంటూ ఏడ్చేసిన తేజ.. ఇపుడు తనకు సపోర్ట్ లేదంటూ బాధపడిపోతున్నాడు. టికెట్ టు ఫినాలే రేస్ కోసం మాజీ కంటెస్టెంట్స్ అయిన అఖిల్, హరికలను బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపించారు. వారు వెళ్ళగానే రోహిణి, గౌతమ్, విష్ణు, టేస్టీ తేజ మద్యన స్టార్స్ టవర్ టాస్క్ పెట్టారు. 

దానిలో హారిక దగ్గర నుంచి అఖిల్ వరకు అందరూ రోహిణిని సపోర్ట్ చేసారు. దానితో ఆమె ఆ టాస్క్ గెలిచింది. ఆతర్వాత తేజ గెలుస్తాడు అనుకుంటే అతని టవర్ పడిపోయింది. అప్పుడు టేస్టీ తేజ అవినాష్ దగ్గర రెండోసారి నేను పెడతాను అనుకున్నాను, కానీ నాకు వచ్చినట్టే ట్రయిల్ టోన్ మిగిలిపోతుంది. దేనికైనా సపోర్ట్ కావాలి అన్నా అని తేజ అంటే.. అవును ఆ స్టార్స్ అవి ఎక్కడెలా పెట్టాలో చెబితే గెలిచారు అంటూ అవినాష్ అన్నాడు. 

నాకసలు ఈ హౌస్ లో సపోర్ట్ లేదు భయ్యా అంటూ టేస్టీ తేజ బాధపడిన ప్రోమో వైరల్ గా మారింది. 

Tasty Teja crying that I have no support:

Bigg Boss 8-Tasty Teja crying that I have no support

Tags:   TASTY TEJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ