Advertisementt

మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ తేదీ వచ్చేసింది

Tue 26th Nov 2024 12:13 PM
mokshagna  మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ తేదీ వచ్చేసింది
The opening date of Mokshagna movie has arrived మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ తేదీ వచ్చేసింది
Advertisement
Ads by CJ

నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశానికి 2024 ని బాలయ్య సెట్ చేసారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ దర్శకుడు. అక్క తేజస్విని, చేరుకురి సుధాకర్ నిర్మాతలు, అంతేకాదు మోక్షజ్ఞ మొదటి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసినా ఆ సినిమా ఓపినింగ్, అలాగే రెగ్యులర్ షూటింగ్ వివరాలు తెలియక అభిమానులు చాలా నిరాశ పడుతున్నారు. 

2024 లో మోక్షజ్ఞ మూవీ రెగ్యులర్ షూట్ ఉండకపోవచ్చని డిజప్ప్పాయింట్ మోడ్ లోకి నందమూరి ఫ్యాన్స్ వెళుతున్న తరుణంలో మోక్షజ్ఞ మూవీ ఓపినింగ్ న్యూస్ వారిని అలెర్ట్ చేసింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కి ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 5 న ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ సినిమా పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలైనట్లుగా తెలుస్తుంది. 

అయితే నందమూరి వారసుడి డెబ్యూ మూవీ పూజ కార్యక్రమాలు అతిరథమహారధుల నడుమ నిర్వహిస్తారా? లేదంటే బాలయ్య మాత్రమే హాజరై కొడుకు మోక్షు సినిమాని మొదలు పెడతారా అనేది తెలియాల్సి ఉంది. మరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ కోసం అభిమానులైతే తెగ ఎదురు చూస్తున్నారు. ఈ న్యూస్ తో వారు పండగ చేసుకోవడం గ్యారెంటీ. 

The opening date of Mokshagna movie has arrived:

Muhurat Fixed For Mokshagna Debut

Tags:   MOKSHAGNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ