Advertisementt

రామ్ చరణ్ తో సాయి పల్లవి ఫిక్స్

Tue 26th Nov 2024 10:36 AM
sai pallavi  రామ్ చరణ్ తో సాయి పల్లవి ఫిక్స్
Sai Pallavi fix with Ram Charan రామ్ చరణ్ తో సాయి పల్లవి ఫిక్స్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 సెట్స్ లోకి ఎంటర్ అయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు చాలా ఎగ్జైట్ అవుతూ రామ్ చరణ్ మేకోవర్ పై సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్ నెట్టింట సంచలంగా మారింది. ఈ చిత్రం మైసూర్ లో స్టార్ట్ అవగా.. RC 16 లో రామ్ చరణ్ కి జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ జోడి కడుతుంది. గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 

RC 16 తర్వాత చరణ్ సుకుమార్ తో తన తదుపరి మూవీ చెయ్యబోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ సమయంలోనే సుకుమార్ కొన్ని షాట్స్ లాక్ చేసేసారు. ప్రస్తుతం పుష్ప 2 రిలీజ్ పనుల్లో బిజీగా వున్న సుకుమార్ పుష్ప 2 రిలీజ్ తర్వాత భారీ గ్యాప్ తీసుకుని చరణ్ మూవీ పై వస్తారట. ఈలోపులో చరణ్ బుచ్చిబాబు మూవీని ఓ కొలిక్కి తెస్తారని తెలుస్తోంది. 

అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించే ఛాన్స్ కాదు, ఆల్మోస్ట్ హీరోయిన్ గా ఫిక్స్ అంటున్నారు. RC 17లో  హీరోయిన్ పాత్ర‌కు అన్ని ర‌కాలుగా సాయి ప‌ల్ల‌వి ఫిట్ అవుతుంద‌ని ఆమెనే తీసుకోవాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారట‌. ప్రస్తుతం తండేల్ మూవీతో పాటుగా బాలీవుడ్ క్రేజీ ఫిలిం రామాయణ లో సీత గా నటిస్తుంది. 

ఆమె అయితే పాన్ ఇండియా మార్కెట్ లోను మంచి క్రేజ్ వస్తుంది అని సుకుమార్ చరణ్ కోసమే సాయి పల్లవిని సెట్ చేసుకున్నారని టాక్. 

Sai Pallavi fix with Ram Charan:

Sai Pallavi To Star Opposite Ram Charan In Sukumar Film

Tags:   SAI PALLAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ