Advertisementt

మెగా చిన్న కోడలు రాయల్ లుక్

Tue 26th Nov 2024 09:24 AM
lavanya tripathi  మెగా చిన్న కోడలు రాయల్ లుక్
Mega Chinna Kodalu Royal Look మెగా చిన్న కోడలు రాయల్ లుక్
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టి అప్పుడే ఏడాది పూర్తి చేసుకుంది లావణ్య త్రిపాఠి, పెళ్లి తర్వాత ఆమె నటనకు దూరమవ్వకపోయినా.. ఆమెకి అవకాశాలు తగ్గడంతో అత్తారింట్లోనే చక్కగా భర్త వరుణ్ తేజ్ తో కాపురం చేసుకుంటుంది. మధ్య మధ్యలో ఏ షాప్ ఓపినింగ్స్ కో, లేదంటే వరుణ్ తేజ్ తో కలిసి సరదాగా వెకేషన్స్ కో వెళుతుంది. 

అత్తగారు పద్య తో కలిసి లావణ్య త్రిపాఠి ఇంట్లో చక్కటి వంటలు కూడా చేస్తుందట. ఆ మద్యన ఆడబడుచు నిహారిక అయితే మా వదిన లావణ్య 24 గంటలు ఇంట్లోనే ఉంటుంది ఆమెకి అస్సలు బోర్ కొట్టదు. కానీ నాకు ఒక్క గంట ఇంట్లో ఉంటే పిచ్చిపడుతుంది అంటూ లావణ్య గురించి చెప్పింది. 

ఇక పెళ్లి తర్వాత ఆమె షూటింగ్స్ కి హాజరవ్వకపోయినా సోషల్ మీడియాలో చక్కటి ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లో కనిపించే లావణ్య త్రిపాఠి తాజాగా పింక్ శారీ ఫొటోస్ పోస్ట్ చేసింది.  సింపుల్ గా ఉంటూనే అట్రాక్ట్ చేసిన లావణ్య త్రిపాఠి కొత్త ఫొటోస్ చూసిన వారు వావ్ లావణ్య రాయల్ లుక్ అదిరిందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Mega Chinna Kodalu Royal Look:

Lavanya Tripathi latest pink Saree photoshoot

Tags:   LAVANYA TRIPATHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ