Advertisementt

నాగార్జున ఒప్పుకుంటారా

Mon 25th Nov 2024 07:36 PM
naga chaitanya  నాగార్జున ఒప్పుకుంటారా
Would Nagarjuna agree నాగార్జున ఒప్పుకుంటారా
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించాను అంటే ఒప్పుకుని గోవా లో గ్రాండ్ గా వివాహం జరిపించడమే కాదు హైదరాబాద్ లో ప్రముఖులకు, అభిమానులకు రిసెప్షన్ కూడా ఇచ్చారు. ఆ పెళ్లి విడాకులకు దారి తియ్యడం, నాగ చైతన్య మరో పెళ్ళికి సిద్దమవ్వడం దానికి నాగ్ కూడా ఓకె చెప్పడం అన్ని జరిగిపోయాయి. 

హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య వివాహాన్ని జరిపించడానికి నాగ్ ఏర్పాట్లు మొదలు పెట్టారు. డిసెంబర్ 4 అంటే మరో పది రోజుల్లో అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తండ్రి విగ్రహం సాక్షిగా పెద్ద కొడుకు చైతు పెళ్లిని నాగ్ నిశ్చయించారు. కేవలం మూడు వందల మంది ప్రముఖులు, ఫ్యామిలీ మెంబెర్స్, స్నేహితులు, సన్నిహితుల నడుమ చైతు-శోభిత ల పెళ్లి జరగబోతుంది. 

అయితే నాగ చైతన్య-శోభిత పెళ్లి రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి విక్రయించినట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు చైతు-శోభితల పెళ్లి హక్కులను ఎవ్వరికి ఇవ్వలేదట. ప్రముఖ ఓటీటీ సంస్థలు చైతు పెళ్లి హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయట. చైతు-శోభితాల ప్రేమ, పెళ్లిని డాక్యుమెంటరిగా ప్రసారం చేసేందుకు అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారట. 

మరి బాలీవుడ్ నుంచి కొల్లవుడ్ వరకు నడుస్తున్న ట్రెండ్ ని నాగ్ ఒప్పుకుంటారా, వాళ్లలాగే నాగ్ కూడా కొడుకు పెళ్లిని క్యాష్ చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. 

Would Nagarjuna agree:

Naga Chaitanya - Sobhita Wedding To Stream As Documentary

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ