ఫ్యాషన్ కి మారు పేరు రకుల్ ప్రీత్ సింగ్, అఫ్ కోర్స్ హీరోయిన్స్ అంటే ఫ్యాషనబుల్ గానే ఉంటారు అందులో సందేహం లేదు. కానీ రకుల్ ప్రీత్ మాత్రం సీత కొక చిలక మాదిరి రంగురంగుల డ్రెస్సులతో సోషల్ మీడియాలో ట్రెండీ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంది. కొన్నాళ్లుగా రకుల్ ప్రీత్ కెరీర్ డోలాయమనంలో ఉన్నా రకుల్ మాత్రం సోషల్ మీడియాకు అస్సలు బ్రేక్ ఇవ్వదు.
తాజాగా రకుల్ ఒకేరోజు రెండు రకాల డ్రెస్సులతో స్టైలిష్ ఫొటోస్ వదిలింది. అందులో ఒకటి బ్లాక్ ఫ్రాక్ కాగా.. రెండోది వైట్ మోడ్రెన్ వేర్. వైట్ కాస్ట్యూమ్స్ లో రకుల్ ప్రీత్ స్టైలిష్ గా కనిపించిన అభిమానులను కనువిందు చేసింది.
కెరీర్ ఎలా ఉన్నా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు పెళ్లి తర్వాత భర్త జాకీ భగ్నానీ ఫ్యామిలీతో కలిసి ట్రెడిషనల్ గా ఫెస్టివల్స్ ని జరుపుకుంటుంది.