Advertisementt

మీనాక్షి చౌదరి కి హిట్ దక్కిందా

Mon 25th Nov 2024 11:15 AM
meenakshi chaudhary  మీనాక్షి చౌదరి కి హిట్ దక్కిందా
Did Meenakshi Chaudhary get a hit మీనాక్షి చౌదరి కి హిట్ దక్కిందా
Advertisement
Ads by CJ

లక్కీ భాస్కర్ తో లక్కి గర్ల్ గా మారిన మీనాక్షి చౌదరి ఆ చిత్రం సక్సెస్ లో భాగమవడమే కాదు.. ఆ చిత్రంతో 100 కోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కెరీర్ లో లక్కీ భాస్కర్ ఆమెకి ఎప్పటికి గుర్తుండి పోయే చిత్రంలా మారగా.. ఆతర్వాత రెండు వారాలకు మట్కా తో హిట్ కొడదామని ఉవ్విళ్లూరింది. కానీ ఆ చిత్ర రిజల్ట్ తో డిజప్పాయింట్ అయ్యింది. 

ఆ తర్వాత వారం తిరక్కుండానే మీనాక్షి చౌదరి విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ అంటూ వచ్చేసింది. ఈ చిత్రంలో శ్రద్ద శ్రీనాధ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మీనాక్షి చౌదరికి లక్కి భాస్కర్ లో సుమతి లాంటి అద్భుతమైన పాత్ర దొరికితే మట్కా లో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మెకానిక్ రాకీలో మీనాక్షి పరిస్థితి ఏమిటో చూద్దాం. 

మెకానిక్ రాకీలో మీనాక్షి చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ బావున్నా ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు, కేవలం రెండు మూడు సీన్స్ కి బావున్నప్పటికీ ఆమె పాత్ర సినిమాలో కీలకం కాకపోవడం మీనాక్షికి మైనస్. ఇక ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ రావడం కూడా మీనాక్షి చౌదరికి నిరాశే అని చెప్పాలి. 

ఈ చిత్రం తర్వాత మళ్ళీ నెలన్నర గ్యాప్ లో సంక్రాంతికి వస్తున్నాం అంటూ విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్ర రిజల్ట్ అయినా మీనాక్షికి హెల్ప్ అవుతుందేమో చూద్దాం.

Did Meenakshi Chaudhary get a hit:

Meenakshi Chaudhary Mechanic Rocky result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ