Advertisementt

పుష్ప 2 కిస్సిక్ సాంగ్ ఓకె ఓకె

Mon 25th Nov 2024 11:03 AM
pushpa 2  పుష్ప 2 కిస్సిక్ సాంగ్ ఓకె ఓకె
Pushpa 2 kissik song ok ok పుష్ప 2 కిస్సిక్ సాంగ్ ఓకె ఓకె
Advertisement
Ads by CJ

పుష్ప 2 ద రూల్ లో ఐటమ్ సాంగ్ పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.  పుష్ప ద రైజ్ లో ఊ అంటావా మావా ఊఉ అంటావా మావా సాంగ్ దుమ్మురేపి మాస్ హిట్ అవడంతో అందరికి పుష్ప 2 స్పెషల్ సాంగ్ పై క్రేజ్ మొదలయ్యింది. అందుకు తగ్గట్టే సుక్కు అండ్ టీమ్ పుష్ప ద రూల్ కోసం డాన్స్ లో స్పెషల్ గా కనిపించే శ్రీలీల ని తీసుకొచ్చారు. 

అప్పటినుంచి సమంత తో శ్రీలీల గ్లామర్ విషయంలో, డాన్స్ విషయంలో మ్యాచ్ అవుతుందా, ఊ అంటావా మావా సాంగ్ లా కిస్సిక్ సాంగ్ హైలెట్ అవుతుందా అని అందరూ తెగ చర్చించేసుకున్నారు, తాజాగా చెన్నై పుష్ప 2 ఈవెంట్ లో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసారు. మరి పాట లో మ్యూజిక్ సూపర్, కానీ దెబ్బలు పడతాయ్ అంటూ లిరిక్స్ అస్సలు మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్స్ చెయ్యలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అల్లు అర్జున్ తో శ్రీలీల మాస్ స్టెప్స్, ఆమె వైట్ కాస్ట్యూమ్ లుక్ అన్ని బావున్నాయి. కానీ సమంత అంత ఎట్రాక్టింగ్ గా శ్రీలీల కనిపించలేదు, దానికి తోడు కిస్సిక్ సాంగ్ ఊపు తేలేదు, ఊ అంటావా మావాతో పోలిస్తే ఈ పాట తేలిపోయింది, సుక్కు ఈ సాంగ్ తో బాగా డిజప్పాయింట్ చేసాడు అంటూ మ్యూజిక్ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Pushpa 2 kissik song ok ok:

Pushpa 2 kissik song audience response

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ