Advertisementt

మొత్తానికి పుష్ప2 పై బ్లాస్ట్ అయిన దేవీశ్రీ

Sun 24th Nov 2024 10:06 PM
pushpa 2  మొత్తానికి పుష్ప2 పై బ్లాస్ట్ అయిన దేవీశ్రీ
Devi Sri is a blast on Pushpa2 మొత్తానికి పుష్ప2 పై బ్లాస్ట్ అయిన దేవీశ్రీ
Advertisement
Ads by CJ

పుష్ప ద రైజ్ కి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కి వచ్చేసరికి కేవలం మ్యూజిక్ కి మాత్రమే ఆయన్ని ఉంచి.. BGM కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకురావడం పుష్ప అభిమానులు చాలా డిజప్పాయింట్ చేసింది. అయినప్పటికీ థమన్ వంటి టాప్ BGM ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ని తేవడంతో  బిగ్ రీలీఫ్ ఇచ్చారు మేకర్స్. 

అయితే పుష్ప 2 నేపధ్య సంగీతం నుంచి తప్పుకున్న దేవిశ్రీ పుష్ప 2 విషయంలో ఎలాంటి రిప్లై ఇస్తాడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. తాజాగా పుష్ప2 చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 నుంచి తనని తప్పించడం పై ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయినట్లే కనిపించాడు. 

రవి గారు టైం కి పాట ఇవ్వలేదు, టైం కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు అనేకాదు ఇప్పడు ఈ ఈవెంట్ కి కూడా లేట్ గా వచ్చా అన్నారు.. మీకు నా మీద ప్రేమ ఉంది, కానీ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రేమ ఉంది, కానీ కంప్లంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటూ దేవిశ్రీ ప్రసాద్ తాను సమయానికి BGM ఇవ్వని కారణంగా నిర్మాతలు కొత్త వాళ్ళని తీసుకున్నారని పుష్ప 2 మేకర్స్ ని ఉద్దేశించి సెటైర్ వేసినట్లుగా, నవ్వుతూనే పుష్ప 2 నిర్మాత‌ల‌కు చుర‌క‌లు అంటించేశాడు దేవిశ్రీ ప్రసాద్. 

Devi Sri is a blast on Pushpa2:

Devi Sri Prasad on Pushpa 2 music

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ