Advertisementt

బిగ్ బాస్ 8 లో గౌతమ్ ని డీ ఫేమ్ చేస్తున్నారా

Sun 24th Nov 2024 05:15 PM
gautham  బిగ్ బాస్ 8 లో గౌతమ్ ని డీ ఫేమ్ చేస్తున్నారా
Is Gautham being de-famed in Bigg Boss 8 బిగ్ బాస్ 8 లో గౌతమ్ ని డీ ఫేమ్ చేస్తున్నారా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు గౌతమ్ గత సీజన్ వలే దూకుడు స్వభావంతో ఓల్డ్ కంటెస్టెంట్స్ పై పగ పెంచుకున్నాడు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ వాళ్ళను పదే పదే టార్గేట్ చేస్తూ చూస్తున్నారు, ఆడియన్స్ అంతా చూస్తున్నారు అంటూ గౌతమ్ ఎప్పుడు కెమెరాలతో మట్లాడడం, కన్నడ బ్యాచ్ అయిన నిఖిల్, యష్మి , పృథ్వీలను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టడం అన్ని ఓ రేంజ్ లో ఉన్నాయి. 

అయితే ఈ వారం మెగా చీఫ్ టాస్క్ లో పాతవాళ్ళు వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని ఎలా ఇంటి నుంచి పంపించాలి అని గూడుపుఠాణి చేసారు అందుకే నేను రోహిణిని సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. దానితో విష్ణు ప్రియా, పృథ్వీ లు గౌతమ్ తో గోడవ పడ్డారు. పృథ్వీ వరెయ్ అంటూ మీదకు రాగా గౌతమ్ ఏంటి మీదకొస్తున్నావ్ నా బొచ్చు కూడా పీకలేవ్ అన్నాడు. అక్కడ పెద్ద రచ్చే జరిగింది. 

అయితే వీకెండ్ ఎపిసోడ్ లోను గౌతమ్ నాగార్జున తో వాగ్వాదం పెట్టుకున్నాడు, నాగార్జున గౌతమ్ ని షెటప్ అంటూ కాస్త గట్టిగానే హెచ్చరించారు, నేను కంటెస్టెంట్ ను అనుకుంటున్నావా అంటూ నాగ్ గౌతమ్ ని ఎడా పెడా క్లాస్ పీకారు. అయితే ఒక వర్గం ఆడియన్స్ గౌతమ్ ని బిగ్ బాస్ కావాలనే టార్గెట్ చేసారు, ఆఖరికి నాగార్జున కూడా పూర్తిగా బిగ్ బాస్ చూడకుండా గౌతమ్ ని అలా టార్గేట్ చెయ్యడం చూస్తే కావాలనే గౌతమ్ ని డీ ఫేమ్ చెయ్యడానికి కుట్ర చేసారని అంటున్నారు. 

మరి నిజంగానే గౌతమ్ క్రేజ్ ని ఇమేజ్ ని డ్యామేజ్ చెయ్యడానికే బిగ్ బాస్ ఇలాంటి పనులు చేస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి 

Is Gautham being de-famed in Bigg Boss 8:

Gautham vs Bigg Boss 8

Tags:   GAUTHAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ