కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది, వచ్చే నెల అంటే డిసెంబర్ లోనే కీర్తిసురేష్ పెళ్లి, ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుంది అంటూ గత వారం రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి పై ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కీర్తి సురేష్ హిందీలో నటిస్తున్న మూవీ ట్రైలర్ విడుదలై గ్లామర్ గా రచ్చ చేసింది.
అదలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో కిర్రాక్ లుక్ లో యూత్ ని అట్రాక్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్ ఆఫ్ షోల్డర్ డ్రెస్ లో కీర్తి సురేష్ లుక్ మాత్రం అద్దిరిపోయింది అనే చెప్పాలి. ఆమె డ్రెస్ మాత్రమే కాదు ఆమె ధరించిన డైమండ్ నెక్ లెస్ కూడా చాలా యూనిక్ గా ఉంది.
కొన్నాళ్లగా గ్లామర్ గా టర్న్ అయిన కీర్తి సురేష్ హిందీ ఎంట్రీతోనే రెచ్చగొట్టే కేరెక్టర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి కీర్తి సురేష్ పెళ్లి గాసిప్స్ మధ్యలో ఆమె ఇలాంటి లుక్ లో కనిపించడం మాత్రం ఫ్యాన్స్ ను తెగ ఇంప్రెస్స్ చేసింది.