సమంత నాగ చైతన్య తో ప్రేమలో పడక ముందు హీరో సిద్దార్థ్ తో ప్రేమలో ఉంది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకునే లోపు వారి మధ్యన బ్రేకప్ అవడం, ఆ తర్వాత సమంత నాగ చైతన్య ప్రేమలో పడి పెళ్లి పీటలెక్కడం, నాలుగేళ్ళ పెళ్లి బంధానికి విడాకులతో ముగింపు పలకడం అన్ని అందరికి తెలిసిందే.
తాజాగా సమంత తాను ఎక్కువగా ఖర్చు పెట్టింది మాజీ కి బహుమతులు కొన్నప్పుడే అని చెప్పిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. సమంత నటించిన సిటాడెల్ హనీ - బన్నీ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్-సమంత మధ్య జరిగిన ఇంటర్వ్యూ ఒకటి బయటికి వచ్చింది.
అందులో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా సమంత మీరు అవసరం లేకపోయినా ఎక్కువగా డబ్బులు ఎప్పుడు ఖర్చు పెట్టారు అనగానే సమంత నా మాజీ కి కాస్ట్లీ గ్గిఫ్ట్స్ కొన్నప్పుడు అంటూ చెప్పింది. ఎంత ఖర్చు అయ్యింది అని అడగగా కొద్దిగా ఎక్కువే ఇక నెక్స్ట్ మాట్లాడుకుందామా అని సమంత దానిని అక్కడికి కట్ చేసిన వీడియో వైరల్ అవ్వగా.. సమంత తన మాజీలను ప్రసన్నం చేసుకునేందుకు ఖరీదైన బహుమతులిచ్చింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.