Advertisementt

కమెడియన్ అలీకి ఊహించ‌ని షాక్

Thu 28th Nov 2024 04:26 PM
ali  కమెడియన్ అలీకి ఊహించ‌ని షాక్
An unexpected shock for comedian Ali కమెడియన్ అలీకి ఊహించ‌ని షాక్
Advertisement
Ads by CJ

2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి హాయిగా సినిమాలు చేసుకుంటున్న కమెడియన్ అలీ కి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షణ్యంగా కూలదోస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖులు, రాజకీయనాయకులు, పేద వారు అని కూడా చూడడం లేదు. 

తాజాగా హైడ్రా షాక్ ఆలీకి కూడా తగిలింది. తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబ్‌పేట్ మండ‌లం ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని కమెడియన్ అలీ కి గ్రామ కార్య‌ద‌ర్శి శోభారాణి నోటీసులు ఇవ్వడమే కాదు అక్ర‌మ నిర్మాణాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని అందులో పేర్కొన్నారు. 

వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. ఆయన కుటుంబంతో కలిసి తరుచుగా అక్కడకు వెళ్తుంటారు. ఆవ్యవసాయ భూమిలో అనుమతి లేకుండానే ఫామ్ హౌస్ నిర్మించినట్లు సమాచారం అందడంతోనే గ్రామ పంచాయతీ సెక్రటరీ నోటీసులు అందజేశారు. 

An unexpected shock for comedian Ali:

Hydra notice to Comedian Ali

Tags:   ALI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ