బిగ్ బాస్ సీజన్ 8 చివరికి వచ్చేసింది. ఇప్పటికే 12 వారాలు పూర్తవగా మిగతా మూడు వారాల్లో గేమ్ కన్నా ఎక్కువ ఫన్ ఉండే అవకాశం ఉంది. ఈ వారం నామినేషన్స్ గొడవ అలాగే మెగా చీఫ్ గా హౌస్ లో చివరి చీఫ్ అయ్యే ఛాన్స్ కోసం కొట్లాట.. వీటి మధ్యలో విష్ణు ప్రియా-రోహిణి లు మాట్లాడిన కేరెక్టర్ గురించిన గొడవ అన్ని హైలెట్ అయ్యాయి.
మరి రోహిణి-విష్ణు ప్రియా గొడవ తర్వాత మనస్ఫూర్తిగా సారీ చెప్పేసుకున్నా వీకెండ్ లో నాగార్జున వదలరుగా.. ఆయన వచ్చి రావడంతోనే రోహిణి కష్టపడి ఆడి మెగా చీఫ్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఆతర్వాత విష్ణు ప్రియా-రోహిణి లను పర్సనల్ గా రూమ్ లోకి పిలిచారు. అక్కడ విష్ణు ప్రియా ను రోహిణి కేరెక్టర్ గురించి ఎందుకు మాట్లాడావ్ అన్నారు.
నేను రోహిణి మాట్లాడితేనే మాట్లాడాను, అయినా అక్కడి సిట్యువేషన్ లో ఎన్నో అంటామని అంది, రోహిణి నువ్వు పృథ్వీ, నిఖిల ని ప్లాన్ చేసి తిప్పుకున్నావ్ అని ఎందుకన్నావ్ అన్నారు.
ఆ తర్వాత ఎవరిది తప్పు రోహిణిదా, లేదంటే విష్ణు దా తప్ప అని హౌస్ మేట్స్ ని అడిగితే అవినాష్ ప్లాన్ చేసింది అనడం రోహిణి తప్పు అంటే, ప్రేరణ విష్ణు ప్రియా రోహిణిని జీరో అనడం, ఆతర్వాత కేరెక్టర్ తెలుసు అనడం తప్పు అనగానే విష్ణు మధ్యలో కలగజేసుకుంది. కానీ నాగార్జున మాత్రం విష్ణు ప్రియకు క్లాస్ పీకిన ప్రోమో వైరల్ పైగా మారింది.