ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ భార్య సైరా భాను తన భర్తకు విడాకులిచ్చి విడిపోతునట్లుగా సైరా భాను లాయర్ ప్రకటించారు.ఈ విడాకులపై రెహ్మాన్ కూడా స్పందించారు. రెహమాన్ ఆయన భార్య విడిపోయిన కొద్ది గంటల్లోనే రెహమాన్ బృందంలోని ఆయన శిష్యురాలైన మోహినిదే తన భర్త నుంచి విడిపోతున్నట్టుగా ప్రకటించింది.
గురువు దారిలోనే శిష్యురాలు తన భర్తతో విడాకులు తీసుకోవడంతో పుకార్లు గుప్పుమన్నాయి. గురువు రెహమాన్ తో శిష్యురాలు మోహినిదేకి సంబందం ఉండడంతోనే రెహమాన్ కి ఆయన భార్య సైరా భాను విడాకులు ఇచ్చినట్టుగా, రెహమాన్ తో ఆయన భార్య విడాకులు తీసుకుని విడిపోవడానికి మోహినిదే కారణమన్నారు.
తాజాగా మోహినిదే రెహమాన్ విడాకులు, తన విడాకులపై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది. నేను విడాకులు ప్రకటించిన తర్వాత చాలామంది నా ఇంటర్వ్యూ కావాలని అడుగుతున్నారు. వారంతా ఎందుకు నా ఇంటర్వ్యూ అడుగుతున్నారో నాకు తెలుసు. వారి అభ్యర్ధనను నేను గౌరవంగా తిరస్కరిస్తున్నారు.
ఇలాంటి రూమర్స్ పై స్పందించి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోవాలనుకోవడం లేదు అంటూ మోహినిదే తన విడాకులు, తనపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైతే చేసింది.