మరో పది రోజుల్లో హీరోయిన్ శోభిత దూళిపాళ్ల అక్కినేని ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టబోతుంది. నాగ చైతన్య కి భార్యగా, నాగార్జున కు కోడలిగా కొత్త రోల్ పోహించేందుకు శోభిత దూళిపాళ్ల రెడీ అవుతుంది. ఇప్పటికే శోభిత అక్కినేని ఫ్యామిలీలోకి అఫీషియల్ గా అడుగుపెట్టింది. గోవా ఫిలిం ఫెస్టివల్ లో నాగార్జున ఫ్యామిలీతో మింగిల్ అయ్యింది.
కాబోయే భర్త నాగ చైతన్య తో కలిసి శోభిత రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే.. అందరి కళ్ళు ఈ జంట పైనే. డిసెంబర్ 4 రాత్రి 8.13 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో కొత్త జీవితంలోకి నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల అడుగుపెట్టనున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఓ అందమైన సెట్ లో ఈ జంట వివాహ వేడుక సింపుల్ గా జరగనుంది.
ఈరోజు నాగ చైతన్య బర్త్ డే. తనకు కాబోయే భర్త బర్త్ డే కి శోభిత ఓ బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చెసిందని తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో ఉన్న శోభిత చైతు కోసం గోవాలోని బీచ్ ఒడ్డున తన ఫ్యామిలీతో కలిసి శనివారం ఈవెనింగ్ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం అక్కినేని అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.