వైసీపీ కి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చైర్మన్ కి పంపించడమే కాదు, తాను వైసీపీ ప్రభుత్వంలో ఉండి కొల్లేరు ప్రజల కోసం ఏమి చెయ్యలేకపోయానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అధికార పార్టీలో ఉండి ప్రజలకు ఏమి చెయ్యలేకపోయానంటూ ఎమోషనల్ అయిన జయ మంగళ వెంకటరమణ.
23 సంవత్సరాలు టిడిపిలో ఉండి కొల్లేరు ప్రజల కోసమే నేను వైసీపీలోకి వచ్చాను, కానీ నా నియోజక వర్గ ప్రజల కోసం వైసీపీలో కూడా ఏమీ చేయలేకపోయాను. ఏదైనా సమస్యలు చెప్పుకోవడానికి వెళితే జగన్ మోహన్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సజ్జలతో మాట్లాడు ధనుంజయ గారితో మాట్లాడు అనడమే తప్ప ఏ పని జరగలేదు.
కనీసం పోలీసులకి ఫోన్ చేయాలన్నా స్వతంత్రం లేదు, పదవి అయితే ఇచ్చారు గాని పవర్ ఇవ్వలేదని జగన్ పై జయ మంగళ సెన్సేషనల్ కామెంట్స్ చేసారుర్. ప్రస్తుతం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటలో ఉంటాను, కార్యకర్తలతో చర్చించాకే తానే పార్టీలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయం తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు.