Advertisementt

కిరణ్ అబ్బవరం క ఓటీటీ కి వచ్చేస్తోంది

Sat 23rd Nov 2024 01:39 PM
ka  కిరణ్ అబ్బవరం క ఓటీటీ కి వచ్చేస్తోంది
Ka coming on OTT కిరణ్ అబ్బవరం క ఓటీటీ కి వచ్చేస్తోంది
Advertisement
Ads by CJ

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం క. ఈ చిత్రం దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 31 న విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. కిరణ్ అబ్బవరం చిత్రంతో మొదటిసారి 50 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన చిత్రం పాన్ ఇండియా భాషల్లోనూ విడుదలకు సిద్ధమైంది. 

ఇక థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఓటీటీ రిలీజ్ పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది.  సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈటివి విన్ నుంచి ఈ చిత్రం త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా కాదు ఈ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతునట్టుగా డేట్ లాక్ చేశారు

అంటే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల గ్యాప్ లో ఈచిత్రం ఓటీటీలోకి రాబోతుంది, ఓటీటీ స్ట్రీమింగ్ పై ఈటివి విన్ వారు అధికారిక ప్రకటన ఇచ్చేసారు. మరోపక్క చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ చేపట్టారు. 

Ka coming on OTT:

KA OTT Release Date and Streaming Platform

Tags:   KA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ