పోసాని కృష్ణమురళి వైసీపీ కి రాజీనామా చేసింది లోకేష్, పవన్ కళ్యాణ్ వలన అరెస్ట్ అయ్యి జైలుకు వెళతానేమో అని భయపడి కాదా? పోసాని కృష్ణమురళి వైసీపీ కి రాజీనామా చెయ్యడమే కాదు, రాజకీయాలు మాట్లాడను, ఇకపై నేను రాజకీయాల జోలికి వెళ్ళను అంటూ దణ్ణం పెట్టింది తన నోటి దూల వలన కదా? పోసాని రాజీనామా చేసింది జగన్ వైఖరి వలనా..
పోసాని కృష్ణమురళి జగన్ ప్రభుత్వంలో జగన్ ని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవడమేకాదు, ఈ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా సాక్షి ఛానల్ లో కూర్చుని కూటమి ప్రభుత్వాన్ని అడ్డమైన తిట్లు తిడుతున్న అతనిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది.
ఇక రేపో మాపో అరెస్ట్ అన్న సమయంలో పోసాని సడన్ గా వైసీపీ కి రాజీనామా ప్రకటించడమే కాదు, రాజీయాలు మాట్లాడను అని, సాక్షి ఛానల్ లో జాబ్ కూడా మానేస్తునట్టుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం వెనుక పోసాని కేసులకు భయపడి రాజీనామా చేసాడు అనుకుంటే.. కాదు జగన్ మోహన్ రెడ్డి తన కోసం పని చేసిన పోసానిని పట్టించుకోలేదు.
తన కోసం సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ తప్పేం చేసాడు అంటూ జగన్ తన కోసం ప్రాణం పెట్టి పని చేసిన పోసాని మాట అస్సలు లేవనెత్తలేదు, అందుకే జగన్ పై అలిగిన పోసాని రాజీనామా చేసాడు అంటూ బ్లూ మీడియా కథనాలు స్టార్ట్ చేసింది. RGV మీద జగన్ కి ప్రేమ ఉంది, జగన్ కోసం కూటమి ప్రభుతాన్ని తిట్టిన నన్ను పట్టించుకోలేదు అని పోసాని ఫీలై రాజీనామా చేసాడు అంటూ వార్తలు రాయడం హాట్ టాపిక్ అయ్యింది.