Advertisementt

చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని - అల్లు అర్జున్

Fri 22nd Nov 2024 08:45 PM
allu arjun  చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని - అల్లు అర్జున్
Allu Arjun is a big fan of Chiranjeevi చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని - అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

మెగా-అల్లు ఫ్యామిలీస్ మధ్యన విభేదాలంటూ మీడియాలో వార్తలు కనిపించడం ఏమో కానీ.. వారి రెండు ఫ్యామిలీస్ కలిసి ఏ అకేషన్ అయినా కలిసి చేసుకుంటాయి. ఆనందాన్ని పంచుకుంటాయి. పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చెయ్యని కారణంగా నాగబాబు ఫ్యామిలీ అల్లు అర్జున్ పై కోపంగా ఉంది. అది వాస్తవం. ఆ విషయంలో అల్లు అర్జున్ పదే పదే వివరణ ఇస్తున్నాడు. ఒకే ఇంట్లో ఉండే నా తండ్రి అభిప్రాయంతోనే నేను ఏకీభవించను, అలాంటిది అంటూ ఆహా అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ముందు ఇండైరెక్ట్ గా నాగబాబు విషయాన్ని తెగ్గొట్టేసాడు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి గారంటే ఆయన స్టార్ కాకముందు నుంచే ఆయనంటే నాకు ఇష్టం. ఆయనతో ఊహ తెలిసాక చాలా క్లోజ్ గా ఉంటూ ఆయనతో ట్రావెల్ చేసాము. నాకు 20ఏళ్ళప్పటి నుంచి ఈ  20 ఏళ్లలో చిరు గారితో నా అనుబంధం ఎలా ఉందొ అందరికి  తెలుసు. 20 ఏళ్ళకి ముందు ఆయనతో నా అనుబంధం గురించి ఎవ్వరికి తెలియదు. 

కానీ నాకు అది చెప్పే అవసరం ఇప్పటివరకు రాలేదు. ఆయన స్టార్ డమ్ కంటే ఆయన ఓ హ్యూమన్ గా నాకు ఇష్టం. నేను అందుకే ఆయనకు ఫ్యాన్ గా మారాను. 

ఆయన స్టార్ అయ్యాక మమ్మల్ని అందరిని ఫారిన్ ట్రిప్ కి తీసుకెళ్లారు. ఆ ట్రిప్ కి ఆయన ముగ్గురు పిల్లలను, వైఫ్ ని తీసుకెళ్ళొచ్చు, కానీ ఆ సమయంలో ఫారిన్ ట్రిప్ ఎంత అసాధ్యమో అందరికి తెలుసు, కానీ ఓ పది మంది పిల్లలను నన్ను శిరీష్, చరణ్ ఇలా అందరిని తీసుకుని మాల్దీవులు లాంటి ప్లేసుకి ఓ నాలుగైదు రోజులు ఆయన ఫారిన్ ట్రిప్ తీసుకేళ్లారు. ఆయనంటే నాకు చిన్నప్పటినుంచి ఇష్టం, ప్రాణం అంటూ అల్లు అర్జున్ ఆహా అన్ స్టాపబుల్ లో చెప్పుకొచ్చాడు. 

Allu Arjun is a big fan of Chiranjeevi:

Allu Arjun shares his boyhood memories with Chiranjeevi

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ