Advertisementt

ఒకే పెళ్ళిలో నయన్-ధనుష్

Fri 22nd Nov 2024 12:16 PM
dhanush  ఒకే పెళ్ళిలో నయన్-ధనుష్
Nayanthara, Dhanush attend Idli Kadai producer wedding ఒకే పెళ్ళిలో నయన్-ధనుష్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కోలీవుడ్ లో ధనుష్-నయనతార వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తున్న సమయంలో నయనతార-ధనుష్ లు ఓ పెళ్లి లో కనిపించడం అందరికి సర్ ప్రైజ్ నిచ్చింది. ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన నానున్ రౌడీనే చిత్రంలోని పాటలు, కొని సీన్స్ ని తన డాక్యుమెంటరీలో వాడుకోవడానికి నయన్ అడగగా దానికి ధనుష్ ఒప్పుకోకపోవడంతో నయనతార ధనుష్ పై ఫైర్ అయ్యింది. 

మూడు సెకన్ల సీన్స్ కోసం 10 కోట్లు పరిహారం అడిగారు అంటూ ధనుష్ పై నయనతార ఫైర్ అయిన తీరు ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చెయ్యడమే కాదు, వారు నయనతార పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉన్న సమయంలో నయనతార తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి చెన్నైలో ఓ పెళ్ళికి హాజరైంది. 

ఆ పెళ్ళికి ధనుష్ కూడా వెళ్ళాడు. అక్కడ నయనతార, ధనుష్ లు కనిపించడం అందరికి షాకివ్వగా.. వీరివురూ ఫేస్ టు ఫేస్ ఎలా రియాక్ట్ అవుతారా అని కొందరు, ఈ సిట్యువేషన్ లో నయన్ ధనుష్ ని ఎలా హ్యాండిల్ చేస్తారా అని కొందరు ఎదురు చూసారు. ధనుష్ మాత్రం నయనతార ని అవాయిడ్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో సంచలనగా మారాయి. అంతేకాదు ధనుష్ ఓ వైపు, నయనతార మరో వైపు కూర్చున్న పిక్ వైరల్ గా మారింది. 

Nayanthara, Dhanush attend Idli Kadai producer wedding :

Dhanush IGNORES Nayanthara at wedding

Tags:   DHANUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ