Advertisementt

పుష్ప 2 - అంతా హరి బరే

Fri 22nd Nov 2024 10:40 AM
pushpa 2  పుష్ప 2 - అంతా హరి బరే
Pushpa 2 - Everything is tension tension పుష్ప 2 - అంతా హరి బరే
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ వచ్చేస్తోంది. డిసెంబర్ 5 న పుష్ప రూల్ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లోకి దిగబోతుంది. ఇప్పటికే మేకర్స్ పుష్ప2 ప్రమోషన్స్ ను భారీ లెవల్లో మొదలు పెట్టేసారు. పుష్ప2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తోనే సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది. అంతా బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ దర్శకుడు సుకుమార్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 

పోస్ట్ పొడక్షన్ వర్క్ లో ఆయన తలమునకలై ఉన్నారు. పుష్ప 2 ప్రమోషన్స్ కి కూడా సుక్కు రారు, రాలేరు, ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనబడలేదు, రేపు చెన్నై ఈవెంట్ లో కనిపిస్తారన్న నమ్మకం లేదు. బ్యాలన్స్ షూట్ మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇలా హరి బరీ గా పుష్ప 2 పనులు చేస్తున్నారు.

సుకుమార్ డే అండ్ నైట్ కంటెంట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతం పుష్ప 2 తో అభిమానుల్లో హైప్ పెరుగుతుంటే పుష్ప టీమ్ లో టెన్షన్ పెరిగిపోతుంది. మరి సుకుమార్ తీరిక చేసుకుని హైదరాబాద్ ఈవెంట్ లో అయినా కనబడతారో.. లేదంటే పుష్ప విడుదలై సెన్సేషనల్ హిట్ కొట్టాక కూల్ గా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఆయినా దర్శనమిస్తారో, లేదో చూడాలి. 

 

Pushpa 2 - Everything is tension tension:

Pushpa 2 update

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ