Advertisementt

బిగ్ బాస్ 8 - ఈ వారం ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్

Fri 22nd Nov 2024 09:31 AM
bigg boss  బిగ్ బాస్ 8 - ఈ వారం ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్
Bigg Boss 8 - Big twist in voting this week బిగ్ బాస్ 8 - ఈ వారం ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో 12 వారాలు పూర్తి కాబోతున్నాయి. గత వారమంతా ఫ్యామిలి వీక్ ఎమోషన్స్ తో కనిపించిన కంటెస్టెంట్స్ ఈ వారం వచ్చేసరికి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ చేతిలో బుక్ అయ్యారు. నామినేషన్స్ లో హౌస్ లోని కన్నడ బ్యాచ్ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ గ్రూప్ గేమ్ ని కడిగిపారేయ్యడమే కాదు, యష్మి-నిఖిల్ మధ్యన వారు మంట పెట్టి పోయారు. 

అయితే ఈ సీజన్ మొదటి నుంచి నిఖిల్ నామినేషన్స్ లోకి వస్తే అతని ఆట మెచ్చిన బుల్లితెర ప్రేక్షకులు నిఖిల్ కి ఓట్లు గుద్ధిపారేస్తున్నారు. కొన్నాళ్ళు నబీల్ కూడా నిఖిల్ కి పోటీ ఇచ్చాడు. ఈ వారం నామినేషన్స్ పాయింట్స్ లో నిఖిల్ ఇమేజ్ డ్యామేజ్ అవడంతో ముందునుంచి నబీల్ ఓటింగ్ లో నిఖిల్ కి పోటీ ఇస్తూ వస్తున్నాడు. 

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ, నబీల్ లలో గత మూడు రోజులుగా నిఖిల్-నబీల్ లు ఓటింగ్ లో పోటీ పడితే ఈరోజు ఓటింగ్ లో భారీ ట్విస్ట్ కనిపించింది. అందులో నబీల్‌కు, నిఖిల్ కి ప్రేరణ, యష్మి షాకిచ్చారు. 21.44 శాతం ఓటింగ్‌తో ప్రేరణ నెంబర్‌ వన్‌గా నిలవగా ఆమె దగ్గరగా అంటే యష్మి 20.90 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లోకి వచ్చేసింది. 

ఆ తరవాత నిఖిల్ థర్డ్ ప్లేస్‌లో నిలవగా, నబీల్, పృథ్వీ లు డేంజర్ జోన్ లోకి వచ్చేసారు. మరి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యేలోపు ఎవరు డేంజర్ లోకి వస్తారో చూడాలి. 

Bigg Boss 8 - Big twist in voting this week:

Bigg Boss Telugu 8 Elimination: Major Voting Shifts and Unexpected Twists in Week 12

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ