Advertisementt

రష్మిక తో దేవరకొండ డేటింగ్ ని కన్ఫర్మ్ చేశాడా

Thu 21st Nov 2024 03:49 PM
vijay deverakonda  రష్మిక తో దేవరకొండ డేటింగ్ ని కన్ఫర్మ్ చేశాడా
Has Deverakonda confirmed dating Rashmika రష్మిక తో దేవరకొండ డేటింగ్ ని కన్ఫర్మ్ చేశాడా
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-నేషనల్ క్రష్ రష్మిక మందన్న మంచి ఫ్రెండ్స్. ఇది వారిద్దరూ చెప్పే మాట. కానీ మీడియా అలాగే వారి అభిమానులు మాత్రం విజయ్ దేవరకొండ-రష్మిక మధ్యలో ఏదో నడుస్తుంది అంటూ ఫీలైపోతున్నారు. కారణం వారి కదలికలు అలానే కనిపిస్తాయి. ఎవ్వరికి దొరక్కుండా వెకేషన్స్ కి వెళతారు, ఎమన్నా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ వెకేషన్స్ కి వెళ్లకూడదా అంటారు. 

తాజాగా విజయ్ దేవరకొండ తన సహా నటి తో డేటింగ్ చేస్తున్నాను అంటూ చెప్పి షాకిచ్చాడు. అంటే అది రష్మికా కదా అనేది క్లారిటీ ఇవ్వకపోయినా మిగతా వాళ్ళంతా విజయ్ చెప్పింది రష్మిక గురించే అని ఫిక్స్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ సాహిబా మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్స్ లో భాగంగా మీరు డేటింగ్ లో ఉన్నారా అన్న ప్రశ్నకు.. నాకు 35 ఏళ్ళు, సింగిల్ గా ఎలా ఉంటాను అనుకున్నారు అంటూ ఎల్వీగా ఆన్సర్ ఇచ్చాడు. 

మీరు మీ సహా నటితో డేటింగ్ చేసారా అంటే..  రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు వెళ్లే ముందు తాను ఆ వ్యక్తులతో క్లోజ్ ఫ్రెండ్ షిప్ చేస్తాను, అయినా తాను డేట్‌లకు వెళ్లననీ, ఎవరితోనైనా ఎక్కువ కాలం ఫ్రెండ్ షిప్ ఉంటుందో వారితోనే మాత్రమే తాను బయటకు వెళ్తానని విజయ్ చెప్పడంతో అందరూ విజయ్ డేటింగ్ చేసేది రష్మిక తోనే అని ఫిక్స్ అవుతున్నారు. 

Has Deverakonda confirmed dating Rashmika:

Did Vijay Deverakonda confirm he is dating Rashmika Mandanna

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ