Advertisementt

ఈ వారం ఏ హీరోకి ఎక్కువ హైప్ ఉంది

Wed 20th Nov 2024 04:11 PM
mechanic rocky  ఈ వారం ఏ హీరోకి  ఎక్కువ హైప్ ఉంది
Mechanic Rocky vs Zebra vs Devaki Nandana Vasudeva ఈ వారం ఏ హీరోకి ఎక్కువ హైప్ ఉంది
Advertisement
Ads by CJ

రేపు శుక్రవారం మీడియం రేంజ్ హీరోలు బాక్సాఫీసు దగ్గర పోటీపడుతున్నారు. గత వారం విడుదలైన కంగువ, మట్కా చిత్రాలు నిరాశ పరచడంతో డిజప్పాయింట్ అయిన ప్రేక్షకులు ఈ వారం రాబోయే చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ పై ఆడియన్స్ హోప్స్ పెట్టుకున్నారు. 

విశ్వక్ సేన్ సినిమని ప్రమోట్ చేసే విధానానికి, మెకానిక్ రాకీ ట్రైలర్, పోస్టర్ తో చేస్తున్న హడావిడికి ఈ చిత్రంపై ఇంట్రెస్ట్ కలిగింది. తనపై నెగెటివిటి చూపించే వాళ్లపై మరోసారి విశ్వక్ ఫైర్ అయ్యాడు. ఇక మరో సినిమా సత్యదేవ్ జీబ్రా కూడా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. 

సత్యదేవ్ బ్రహ్మాజీతో కలిసి చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. కానీ ప్రమోషన్స్ పరంగా జీబ్రా వీక్ గా కనిపిస్తుంది. అందులో చిన్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గడం మైనస్, అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ కాస్త కొత్తగా ఆలోచించాలి. ఇక మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ కూడా దేవకీ నందన వాసుదేవ తో నవంబర్ 22 న ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. 

అయితే ఈ చిత్రానికి ఎంతగా ప్రమోషన్స్ చేస్తున్నా హైప్ మాత్రం రావట్లేదు, సూపర్ మహేష్ ఏమైనా ముందుకొచ్చి ఓ వీడియో బైట్ అయినా వదిలితే ఆ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎటు చూసినా ఈ వారం విశ్వక్ సినిమాకే హైప్ ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. 

Mechanic Rocky vs Zebra vs Devaki Nandana Vasudeva:

This friday releases Mechanic Rocky, Zebra, Devaki Nandana Vasudeva

Tags:   MECHANIC ROCKY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ