Advertisementt

అల్లు అర్జున్ కి ఆ అవకాశం దక్కుతుందా

Tue 19th Nov 2024 12:19 PM
allu arjun  అల్లు అర్జున్  కి ఆ అవకాశం దక్కుతుందా
Will Allu Arjun get that chance అల్లు అర్జున్ కి ఆ అవకాశం దక్కుతుందా
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. సుకుమార్, త్రివిక్రమ్ ల సహకారంతోనే అల్లు అర్జున్ ఈ స్థాయికి చేరుకున్నాడు అనడంలో సందేహం లేదు. అయితే టాలీవుడ్ మరియు పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ రాజమౌళి తో ఇప్పటివరకు అల్లు అర్జున్ కి సినిమా చేసే అవకాశం రాలేదు. ఆ విషయంలో చాలామంది సర్ ప్రైజ్ అవుతూ ఉంటారు. అల్లు అరవింద్ లాంటి నిర్మాత కొడుకు, స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ ని రాజమౌళి పట్టించుకోకపోవడం విచిత్రమే. 

రాజమౌళి హీరోలను రిపీట్ చేస్తారు, అలాంటి సమయంలో ఆయనకు అల్లు అర్జున్ గుర్తు రాలేదా అనేది అల్లు అభిమానుల డౌట్. అయితే ఇప్పడు ఈ కాంబో సెట్ అవుతుందా అనే సందేహాలు సోషల్ మీడియాలో రేకెత్తాయి. కారణం పాట్నాలో వేలాదిమంది అభిమానుల నడుమ విడుదలైన పుష్ప 2 ట్రైలర్ తర్వాత రాజమౌళి పాట్నా ఈవెంట్ పై కామెంట్స్ చేస్తూ ట్వీట్ వేశారు. పాట్నాలో పుష్ప ఫైర్ మొదలైంది.. అది దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది.. డిసెంబర్ 4న విస్పోటనం జరుగుతుంది.. పార్టీ కోసం వెయిట్ చేస్తున్నా పుష్ప అంటూ రాజమౌళి వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. 

రాజమౌళి ట్వీట్ కి అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ.. తప్పకుండా పార్టీ ఉంటుంది అంటూ ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ వెయ్యడం చూసి ఈ కాంబో సెట్స్ మీదకి వెళితే బాక్సాఫీసు ఊచ కోతే అంటూ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం అల్లు అర్జున్ కి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అనేది. 

Will Allu Arjun get that chance:

Allu Arjun-Rajamouli combo set

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ