Advertisementt

రామాయణ క్లైమాక్స్ లో సాయి పల్లవినే హైలెట్

Mon 18th Nov 2024 04:53 PM
ramayana  రామాయణ క్లైమాక్స్ లో సాయి పల్లవినే హైలెట్
Sai Pallavi to steal show in Ramayan climax రామాయణ క్లైమాక్స్ లో సాయి పల్లవినే హైలెట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ పై ఎలాంటి అప్ డేట్ మేకర్స్ ఇవ్వకపోయినా.. దానికి సంబందించిన ఏ వార్త కూడా లీక్ అవ్వకుండా, వైరల్ అవ్వకుండా ఉండడం లేదు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి గా, సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత గా, కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ రావణ్ గా కనిపించబోతున్నారనే విషయంలోనూ మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. 

ఇక కొద్దిరోజుల క్రితం రామాయణ రెండు పార్టులుగా విడుదల కాబోతుంది, 2025 దీపావళికి పార్ట్ 1, 2026 దీపావళికి పార్ట్ 2 విడుదల అని మాత్రమే చెప్పారు. రామాయణ మొదలైన కొత్తల్లోనే రణబీర్ రాముడి లుక్, సీతగా సాయి పల్లవి లుక్ అయ్యి సెన్సేషన్ అవ్వగా.. అప్పటి నుంచి మేకర్స్ చాలా పకడ్బందీగా ముంబైలోని స్పెషల్ సెట్ లో రామాయణ ని తెరకెక్కిస్తున్నారు. 

డిసెంబర్ మొదటి వారం నుంచి రామాయణ క్లైమాక్స్ షూట్ చేపట్టనున్నారని, అందులో సాయి పల్లవి సీన్స్ హైలెట్ అవుతాయని చెబుతున్నారు. సాయి పల్లవి నటనను ఎలివేట్ చేసే సీన్స్ ని తెరకెక్కిస్తారని, ఈ సన్నివేశాలు రామాయణ లో హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మరి ఈ న్యూస్ విన్నాక సాయి పల్లవి అభిమానులకు పండగే కదా మరి. 

Sai Pallavi to steal show in Ramayan climax:

Ramayana climax to create a sensation

Tags:   RAMAYANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ