Advertisementt

హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

Mon 18th Nov 2024 01:03 PM
pushpa 2  హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
Jr NTR fans heartbroken as Devara event హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

నిన్న ఆదివారం పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కారణం తమ హీరోకి ఇలాంటి ఓ ఈవెంట్ చెయ్యలేకపోయారు నిర్మాతలు అని. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ట్స్ మేకర్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ తిట్టుకుంటున్నారు. దేవర ట్రైలర్ లాంచ్ ను ముంబైలో మీడియా ముందు నిర్వహించారు. 

హైదరాబాద్ లో జనాలను కంట్రోల్ చేస్తూ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామనుకుంటే అది కాస్తా ఫెయిల్ అయ్యి ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. దేవర చిత్రానికి ఎన్టీఆర్ గనక నార్త్ ఇండియాలో ఓ పెద్ద ఈవెంట్ చేసి ఉంటే దేవర కలెక్షన్స్ మోత మోగిపోయేవి.. అల్లు అర్జున్ చూడండి వెనుక ఎవరు లేకుండా సింగిల్ హ్యాండ్ తో బీహార్ పాట్నాలో జెండా ఎగరేసాడు. 

సుకుమార్ కూడా లేకుండా అల్లు అర్జున్ ఒక్కడే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ని సక్సెస్ చేసాడు, పాట్నాలో పాన్ ఇండియా మూవీ ట్రైలర్ లాంచ్  అంటే పుష్ప 2 నే, కనీసం పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉందొ కూడా మాట్లాడడం లేదు. కేవలం పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ గురించే మాట్లాడుతున్నారు జనాలు అంటే పుష్ప 2 ఈవెంట్ ఎంతగా సక్సెస్ అయ్యిందో అనేది అర్ధమవుతుంది. 

Jr NTR fans heartbroken as Devara event:

Pushpa 2 trailer launched amidst massive fan frenzy in Bihar Patna

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ