Advertisementt

అంత పొగిడి అన్యాయం చేసారు

Mon 18th Nov 2024 10:16 AM
avinash  అంత పొగిడి అన్యాయం చేసారు
So much praise has done injustice అంత పొగిడి అన్యాయం చేసారు
Advertisement
Ads by CJ

నిజమే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన అందరూ అవినాష్ సూపర్, అవినాష్ ఎంటర్టైనర్, అసలు అవినాష్ లేకపోతె సీజన్ 8 లేదు, అవినాష్ నువ్వు కామెడీ మాత్రమే కాదు, టాస్క్ లు కూడా అదరగొట్టేస్తున్నావ్, రోహిణి, అవినాష్ ల కామెడీ ఈ షో కి సూపర్ అంటూ అవినాష్ ని అంతలా పొగిడేస్తే ఖచ్చితంగా అవినాష్ టాప్ 5 లో ఉంటాడని అందరూ అనుకుంటారు. 

బయట ఆడియన్స్ కూడా అవినాష్ కామెడీని లైక్ చేస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అవినాష్ హౌస్లోకి వచ్చాకే జోష్ పెరిగింది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఓటింగ్ లోను అవినాష్ కి పర్వాలేదనిపించే ఓట్స్ వచ్చాయి. కట్ చేస్తే అవినాష్ ఈవారం ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడాల్సి వచ్చేది. కానీ అదృష్టం నబీల్ అతని దగ్గరున్న ఎవిక్షన్ పాస్ వాడడంతో అవినాష్ సేఫ్ అయ్యాడు. టేస్టీ తేజ ని ఎలాగూ ఆడియన్స్ గెలిపించారు. 

కానీ శనివారమే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ ముమ్మరంగా ప్రచారం జరిగింది. దానితో అవినాష్ అంత గొప్ప ఎంటర్టైనర్ అయితే మరో నాలుగు వారాలు షో లో ఉండాలి కదా, ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న విష్ణు ప్రియా, పృథ్వీలను సేవ్ చెయ్యడానికి అవినాష్ ని బలి పశువును చేసారు అంటూ చాలామంది బిగ్ బాస్ ని నానా మాటలన్నారు. కానీ అవినాష్ హౌస్ లోనే ఉండడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. 

So much praise has done injustice:

Avinash is not getting eliminated BB8

Tags:   AVINASH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ