Advertisementt

వార్ 2 స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి..

Sun 17th Nov 2024 08:01 PM
bollywood  వార్ 2 స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి..
Star heroine in Jr NTR-Hrithik War 2 special song వార్ 2 స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీకి సీక్వెల్ గా రాబోతున్న వార్ 2 చిత్ర షూటింగ్ ముంబైలో వేసిన స్పెషల్ సెట్ లో ఫుల్ స్వింగ్ లో జరిగిపోతుంది. హృతిక్ రోషన్-కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. దేవర సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం లేదు.

ప్రస్తుతం క్లైమాక్స్, అలాగే ప్రీ  క్లైమాక్స్ షూటింగ్ లో అయాన్ బిజీగా వున్నాడు. ఎన్టీఆర్-హృతిక్ లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.  ఎన్టీఆర్ కూడా వార్ 2 షూటింగ్ ఓ కొలిక్కి వచ్ఛాకే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి ఎంటర్ అవుతారు. అయితే ఇప్పడు ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రద్ద కపూర్ ని అనుకుంటున్నారట.

స్త్రీ 2 తో అనూహ్యంగా ఫామ్ లోకి వచ్చిన శ్రద్ద కపూర్ అయితే వార్ 2 కి క్రేజ్ వస్తుంది అని మేకర్స్ భావించారట. ఈ సాంగ్ లో హృతిక్ రోషన్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా ఉంటారని, వీరిద్దరితో డాన్స్ చేసే ఛాన్స్ శ్రద్ద కపూర్ కి వచ్చినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. 

Star heroine in Jr NTR-Hrithik War 2 special song:

Bollywood bombshell to explode in War 2 special song

Tags:   BOLLYWOOD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ