Advertisementt

పుష్ప 2 ట్రైలర్: ఫైర్ కాదు వైల్డ్ ఫైర్

Sun 17th Nov 2024 06:52 PM
pushpa the rule  పుష్ప 2 ట్రైలర్: ఫైర్ కాదు వైల్డ్ ఫైర్
Pushpa The Rule Trailer Review పుష్ప 2 ట్రైలర్: ఫైర్ కాదు వైల్డ్ ఫైర్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ మూడేళ్ళుగా కష్టపడి తెరకెక్కిస్తున్న పుష్ప 2 పై అభిమానుల్లో ఏమిటి పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ఈరోజు పాట్నా లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన అభిమానులను చూస్తే అర్ధమవుతుంది. అసలు ఇది ఆంధ్రనా, లేదంటే తెలంగాణానా అన్న రేంజ్ లో పాట్నా ఈవెంట్ లో పుష్ప రాజ్ అభిమానులు ఉన్నారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే వీరాభిమానులుంటారు అనుకోవచ్చు.. కానీ పాట్నాలో ఇంతమంది అబిమానులు పుష్ప 2 కోసం వెయిట్ చెయ్యడం మాములు విషయం కాదు. 

పాట్నాలో అల్లు అర్జున్ అండ్ టీమ్ పుష్ప ద రూల్ ట్రైలర్ విడుదల చేసారు. మరి పుష్ప 1 కి మించి కాదు కాదు అంతకుమించి అనేలా పుష్ప 2 ట్రైలర్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో భీబత్సం చూపించగా.. ఫహద్ ఫాసిల్ భన్వర్ సింక్ షెకావత్ గా విలనిజం చూపించారు. పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కి అభిమానులకు పూనకాలే. 

అంతేకాదు పుష్ప అంటే  బ్రాండ్, ఇంటర్నేషనల్, వైల్డ్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ మరియు డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఎక్కడ చూసిన భారీతనం ఉట్టిపడేలా ట్రైలర్ కట్ ఉంది, పుష్ప 2 ట్రైలర్ ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్ తో నింపేశారు దర్శకుడు సుకుమార్. యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , ఫహద్ లుక్  అన్ని అద్భుతాలే. ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనిపినించేలా చేసింది పుష్ప 2 ట్రైలర్.

Pushpa The Rule Trailer Review:

Pushpa 2 The Rule Trailer Released 

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ