రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో రామ్ చరణ్ ఇకపై బుచ్చి బాబు తో RC 16 సెట్స్ లోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే సూపర్ మేకోవర్ తో RC 16 కోసం ప్రిపేర్ అయిన రామ్ చరణ్ అతి త్వరలోనే అంటే ఈ నెల 22 నుండి మైసూర్ లో మొదలు కాబోయే రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
మొదటి షెడ్యూల్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీకపూర్‌తో పాటు చిత్రంలో ఇతర ముఖ్య పాత్రదారులు పాల్గొంటారు. కొంత టాకీతో పాటు ఓ యాక్షన్ సన్నివేశాన్ని కూడా బుచ్చిబాబు ఇక్కడ షూట్ చేస్తారని సమాచారం. ఇక RC 16 షూటింగ్ తో పాటుగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటారు.
గేమ్ ఛేంజర్ ని పాన్ ఇండియా మార్కెట్ కి దగ్గరయ్యేలా ప్రమోషన్స్ చెయ్యాలని శంకర్ మరియు దిల్ రాజు లు ప్లాన్ చేస్తున్నారు. టీజర్ కే పాట్నా లో పెద్ద ఈవెంట్ పెట్టిన గేమ్ ఛేంజర్ టీం ట్రైలర్ లాంచ్ దగ్గర నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు ముంబై, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.