Advertisementt

బిగ్ బాస్ 8: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..

Sun 17th Nov 2024 10:23 AM
avinash  బిగ్ బాస్ 8: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..
Bigg Boss 8: Who will be eliminated this week బిగ్ బాస్ 8: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో అప్పుడే 11 వారాలు పూర్తయ్యాయి. ఈ వారమంతా ఫ్యామిలీ వీక్ అంటూ హౌస్ మేట్స్ ఎమోషన్స్ తో గడిచిపోయింది. ప్రేరణ మెగా చీఫ్ గా హౌస్ మేట్స్ ఇబ్బంది పడినట్టుగా వారు చర్చలు చూస్తే అర్దమవుతుంది. ఇక 12 వ వారానికి మెగా చీఫ్ గా అవినాష్ రెండోసారి ఎంపికయ్యాడు. 

ఈ వారం నామినేషన్స్ లో గౌతమ్, యష్మి, విష్ణు ప్రియా, టేస్టీ తేజ, పృథ్వీ, అవినాష్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం లో చాలామంది ఓ అంచనాకు వచ్చేసారు. ముందు నుంచి గౌతమ్ నెంబర్ 1 స్థానంలో ఓట్లు కొల్లగొడుతున్నాడు ఆ తర్వాత యష్మి ఒకటి రెండుసార్లు గౌతమ్ కి పోటీ ఇచ్చింది. 

ఇక ఈ శనివారం ఫ్రెండ్స్ ఎపిసోడ్ లో యాంకర్ రవి, శివాజీ, బిగ్ బాస్ ప్రియా, సోహెల్, సన్నీ వీళ్ళను స్టేజ్ పైకి తీసుకొచ్చి నాగార్జున హౌస్ మేట్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. మరి బిగ్ బాస్ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేశారనే విషయంలో ఆసక్తి మొదలైంది. ఈ వారమెవరు ఎలిమినేట్ అయ్యారంటే..  రెండోసారి మెగా చీఫ్‌ కావడమే కాకుండా.. ఎంటర్ టైన్మెంట్ పరంగా, టాస్క్‌ల పరంగా ఆకట్టుకుంటున్న అవినాష్ ని ఎలిమినేట్ చేసారు. 

మెగా చీఫ్‌గా ఉండి ఎలిమినేట్ కావడం అనేది బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటి వరకూ జరగలేదు. ఈవారం మెగా చీఫ్ కావడం వల్ల.. అవినాష్‌ని వచ్చే వారం నామినేషన్స్ నుంచి ఇమ్యునిటీ కూడా లభించేది. నేరుగా 13వ వారం వరకూ ఢోకా ఉండేది కాదు. ప్రేక్షకులు వేసిన అతి తక్కువ ఓట్ల తో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి అవినాష్ ఇంటికెళ్లిపోయాడు. 

Bigg Boss 8: Who will be eliminated this week:

Bigg Boss 8: Avinash eliminated this week

Tags:   AVINASH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ