Advertisementt

నాగ చైతన్య-శోభిత వెడ్డింగ్ కార్డు రివీల్డ్

Sun 17th Nov 2024 09:54 AM
naga chaitanya  నాగ చైతన్య-శోభిత వెడ్డింగ్ కార్డు రివీల్డ్
Naga Chaitanya-Sobhita wedding card goes viral నాగ చైతన్య-శోభిత వెడ్డింగ్ కార్డు రివీల్డ్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-హీరోయిన్ శోభిత దూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4 న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ గ్రాండ్ గా నిర్వహించేందుకు అక్కినేని ఫ్యామిలీ సన్నద్ధం అవుతుంది అనే వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. అసలు చైతు-శోభితల వెడ్డింగ్ డేట్ పై ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేదు. 

తాజాగా నాగ చైతన్య-శోభిత ల వెడ్డింగ్ కార్డు బయటికి వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శోభిత పేరు, తర్వాత చైతు పేరు తో ఈ వివాహ ఆహ్వాన పత్రికను ప్రింట్ చేయించారు. 4th డిసెంబర్ 2024 అంటూ పెళ్లి తేదీని అందులో పొందుపరిచారు. నాగ చైతన్య తల్లితండ్రుల స్థానంలో అక్కినేని నాగార్జున-అమల, ఆ తర్వాత VLK శాస్త్రి-లక్ష్మి కమల అంటే చైతు తల్లి అలాగే స్టెప్ ఫాదర్ నేమ్స్ వేశారు. 

నాగ చైతన్య వెడ్డింగ్ కార్డు ని నాగార్జున సినీ-రాజకీయ ప్రముఖులకు పర్సనల్ గా అందిస్తూ పెళ్ళికి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చైతు-శోభితల వెడ్డింగ్ కార్డు నెట్టింట సంచలనంగా మారింది. 

Naga Chaitanya-Sobhita wedding card goes viral:

Here is Naga Chaitanya-Sobhita wedding card

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ