Advertisementt

పుష్ప 2 ఛాన్స్: బన్నీకి శ్రీలీల గిఫ్ట్

Sat 16th Nov 2024 08:12 PM
sreeleela   పుష్ప 2 ఛాన్స్: బన్నీకి శ్రీలీల గిఫ్ట్
Sreeleela Surprises Allu Arjun And His Wife పుష్ప 2 ఛాన్స్: బన్నీకి శ్రీలీల గిఫ్ట్
Advertisement
Ads by CJ

పుష్ప ది రూల్ లో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఏ హీరోయిన్ కి తగులుతుందో అని పాన్ ఇండియా ప్రేక్షకులు వెయిట్ చేసారు. ఆ లక్కీ ఛాన్స్ బ్యూటిఫుల్ శ్రీలీల కి దక్కింది. అనూహ్యంగా శ్రీలీల పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేసింది. ఆమె గ్లామర్ లుక్, ఆమె వేసిన స్టెప్ కి సంబందించిన పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. 

రీసెంట్ గా ఈ మూవీ ఐటెం సాంగ్ ని శ్రీలీల పూర్తి చేసింది. మరి టాలీవుడ్ టాప్ డాన్సర్స్ లలో ఒకరైన అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల కు కాలు కదిపే అవకాశం రావడం మాములు విషయం కాదు, సినిమాలో ఛాన్స్ తగలకపోయినా ఆయన తో డాన్స్ చేసే అవకాశం దక్కించుకోవడం శ్రీలీల కి చెప్పలేనంత సంతోషం కలిగించింది. అందుకే ఆ సాంగ్ పూర్తి కాగానే అల్లు అర్జున్ కి ఆయన వైఫ్ స్నేహ, పిల్లలకు కలిపి శ్రీలీల అదిరిపోయే గిఫ్ట్ పంపించింది. 

ఆ గిఫ్ట్ ప్యాక్ ని అల్లు అర్జున్ ఇన్స్టా లో షేర్ చేస్తూ.. నువ్వు పంపించిన గిఫ్ట్స్ ఇప్పుడే చూసాను. అందులో నువ్వు రాసిన లెటర్ లో నా మనసుని తాకింది. నీ ప్రేమకి నా కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ శ్రీలీల కి ఇన్స్టా లో రిప్లై ఇచ్చారు. అదే గిఫ్ట్ ని స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శ్రీలీల కి థాంక్స్ చెప్పింది

Sreeleela Surprises Allu Arjun And His Wife:

Pushpa 2 Item girl Sree Leela Sends Gifts To Allu Arjun

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ