Advertisementt

వరుణ్ తేజ్ కారణంగా మెగా vs అల్లు

Sat 16th Nov 2024 07:37 PM
allu fans  వరుణ్ తేజ్ కారణంగా మెగా vs అల్లు
Mega vs Allu because of Varun Tej వరుణ్ తేజ్ కారణంగా మెగా vs అల్లు
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్ మరోమారు మెగా-అల్లు ఫ్యాన్స్ మద్యన గొడవకు ఆద్యం పోసాడు. అసలే పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే మెగా- అల్లు అభిమానుల నడుమ మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. కారణం వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడి నుంచి వచ్చామో, అందుకు ఎవరు సాయం చేశారో మరిచిపోతే ఎన్ని విజయాలు సాధించినప్పటికీ అవేవీ పరిగణనలోకి రావు అంటూ చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసినవే అని అల్లు అభిమానులు అనుకుంటున్నారు. 

అందుకే వరుజ్ తేజ్ మట్కా చిత్రం థియేటర్స్ లో విడుదలవ్వక ముందు నుంచే  ట్రోలింగ్ మొదలుపెట్టి.. విడుదలై నెగెటివ్ టాక్ వచ్చాక చిత్రంపై విపరీతమైన నెగిటివిటి చూపిస్తున్నారు అల్లు ఫ్యాన్స్. వరుణ్ తేజ్ మట్కా చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో థియేటర్స్ లో ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గింది. దానితో మల్టిప్లెక్స్ లలో మట్కా షోస్ క్యాన్సిల్ చేస్తున్నారు. అలానే AAA లోను మట్కా షోస్ క్యాన్సిల్ చెయ్యడంతో కావాలనే వరుణ్ తేజ్ సినిమాని చంపెయ్యడానికి షోస్ క్యాన్సిల్ చేసారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 

మరోపక్క అల్లు ఫ్యాన్స్ మట్కా ఈ సంవత్సరంలో అతి పెద్ద డిజాస్టర్ సినిమా ఇదే.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. సినిమా లో కంటెంట్ లేదు, దర్శకుడు లో స్టామినా లేదు, అది ఫ్లాపైతే తామేం చేస్తామని అల్లు అభిమానులు, మెగా అభిమానులకు ధీటుగా కామెంట్లు పెడుతున్నారు.

Mega vs Allu because of Varun Tej:

Mega fans vs Allu fans

Tags:   ALLU FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ