Advertisementt

బిగ్ బాస్ 8: టాప్ 1 లో డాక్టర్

Sat 16th Nov 2024 12:16 PM
bigg boss 8  బిగ్ బాస్ 8: టాప్ 1 లో డాక్టర్
Bigg Boss 8: Top 1 Gautham బిగ్ బాస్ 8: టాప్ 1 లో డాక్టర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో అగ్రెసివ్ గా కనిపించి గొడవలు పడి టాస్క్ లు ఆడి అశ్వద్ధామ 2.ఓ గా బిల్డప్ ఇచ్చిన గౌతమ్ టాప్ 5 కి వెళ్లలేకపోయాడు. కానీ బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ మొదట్లో యష్మి తో లవ్ ట్రాక్ నడుపుదామని ట్రై చేసి యష్మి ని పడెయ్యలేకపోవడంతో ఆమెపై ఫైర్ అవడమే కాదు ఈ మధ్య సెటిల్ గా ఆడుతూ కన్నడ బ్యాచ్ ని ఢీ కొడుతూ షాకిస్తున్నాడు. 

గత రెండు వారాలుగా గౌతమ్ గ్రాఫ్ పెరిగిపోయింది. నిఖిల్, యష్మి ఇలా అందరిని కిందకి తోసేసాడు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న గౌతమ్ ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అప్పుడప్పుడు యష్మి అతని కి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. గౌతమ్ ని మాత్రం క్రాస్ చెయ్యలేకపాయింది. అతను వైల్డ్ కార్డు కాబట్టి కప్ గెలవకపోయినా.. గౌతమ్ టాప్ 2 లో నిలవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. 

గౌతమ్ బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకోగా.. ఈ వారం మాత్రం టాప్ 5 లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందులో పృథ్వీ-విష్ణు ప్రియాలు లీస్ట్ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. సో ఈ వారం విష్ణు కానీ పృథ్వీ కాని ఎలిమినేట్ అవ్వొచ్చు అని అనధికారిక సమాచారం.  

Bigg Boss 8: Top 1 Gautham:

Bigg Boss 8: 11th week voting result 

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ