Advertisementt

పుష్ప 2 రిలీజ్ ముందు బిగ్ రిలీఫ్

Sat 16th Nov 2024 10:32 AM
kanguva   పుష్ప 2 రిలీజ్ ముందు బిగ్ రిలీఫ్
Pushpa 2 damage before release పుష్ప 2 రిలీజ్ ముందు బిగ్ రిలీఫ్
Advertisement
Ads by CJ

పుష్ప 1 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, నేపధ్య సంగీతం అన్ని ఓ లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే అంచనాలు పుష్ప2 పై లేవనే మాట అభిమానులను కలవరపెడుతుంది. కారణం దేవిశ్రీ ప్లేస్ లోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రావడమే. మ్యూజిక్ దేవిశ్రీ ఇస్తే.. నేపధ్య సంగీతానికి థమన్ మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు.

అక్కడే మ్యూజిక్ లవర్స్ కి పుష్ప 2 పై రిలీఫ్ వచ్చేలా చేసింది. కారణం దేవిశ్రీ రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన కంగువ చిత్రం BGM పై పలు విమర్శలు రావడం, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన BGM కి చెవులు చిల్లు పడ్డాయంటూ వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి అల్లు అభిమానులు ఆందోళన పడాల్సిన స్థానంలో రిలీఫ్ గా కనిపిస్తున్నారు. కారణం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కి నేపధ్య సంగీతం అందించడం లేదు కనక. 

దేవిశ్రీ ప్రసాద్ కంగువ యాక్షన్ ఘట్టాల్లో ఇచ్చిన నేపధ్య సంగీతం అక్కడక్కడా చెవులు పగిలిపోయాయనే కంప్లైంట్ చాలామంది ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. కొన్ని చోట్ల దేవిశ్రీ మ్యూజిక్ వర్కౌట్ అయినా.. మరికొన్ని చోట్ల దేవిశ్రీ BGM పూర్తిగా నిరాశపరిచింది అనే మాట కంగువ చూసిన ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది.

మరి పుష్ప 2 విడుదలకు ముందు కంగువ తో నిరాశపరిచిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కి నేపధ్య సంగీతం ఇవ్వకపోవడం రిలీఫ్ కాక ఇంకేమవుతుంది. ఇప్పుడు పుష్ప 2 కి BGM స్పెషలిస్ట్ థమన్ తో పాటుగా మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చెయ్యడం పుష్ప 2 కి ప్లస్ అవ్వనుంది. 

Pushpa 2 damage before release:

Kanguva: Audience criticizing this aspect severely

Tags:   KANGUVA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ