Advertisementt

చైతు కి పిల్లలు కావాలి, సమంతకి పిల్లలు కావాలి

Fri 15th Nov 2024 09:31 PM
naga chaitanya  చైతు కి పిల్లలు కావాలి, సమంతకి పిల్లలు  కావాలి
Chaitu wants children, Samantha wants children చైతు కి పిల్లలు కావాలి, సమంతకి పిల్లలు కావాలి
Advertisement
Ads by CJ

ఈమధ్యన సిటాడెల్ హనీ-బన్నీ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో సమంత తనకి పిల్లలు కావాలనే కలలు ఉన్నాయి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సిటాడెల్ లో తాను నడియా కు తల్లి పాత్రలో నటించడం సంతృప్తిని ఇచ్చింది, నాకు పిల్లలను కనాలని కోరిక, కల ఉన్నాయి అంటూ చెప్పింది. 

ఇప్పుడు ఆమె మాజీ భర్త నాగ చైతన్య కూడా పిల్లలపై చేసిన హాట్ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం రానా దగ్గుబాటి ఓ టాక్ షో చేస్తున్నారు. ఆ టాక్ షో కి పలువులు సెలబ్రిటీస్ పాల్గొన్నారు. అందులో నాగ చైతన్య కూడా గెస్ట్ గా వచ్చారు. హోస్ట్ రానా మీ కుటుంబం ఎలా ఉండాలనుకుంటున్నావ్ చైతు అని అడిగితే.. గెట్ మారీడ్, కపుల్ ఆఫ్ కిడ్స్ అంటూ పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లలను కనాలనుంది అని  చెప్పగా.. దానికి రానా వెంకీ మామ లాగా లేదంటే అని అనగా.. వెంకీ మామ లా కాదు అన్నాడు చైతు నవ్వుతూ.. 

దీనిని బట్టి డిసెంబర్ 4 న నటి శోభితాని వివాహం చేసుకోబోతున్న నాగ చైతన్య అతి త్వరలోనే ఆ శుభవార్త కూడా వినిపిస్తారేమో అనేలా చైతు రానా టాక్ షో లో చేసిన కామెంట్స్ ఉన్నాయి. 

Chaitu wants children, Samantha wants children:

Naga Chaitanya talks about married life, kids

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ