Advertisementt

చిరాకు పెట్టిస్తున్న బిగ్ బాస్ 8

Fri 15th Nov 2024 06:46 PM
bigg boss 8  చిరాకు పెట్టిస్తున్న బిగ్ బాస్ 8
Annoying Bigg Boss 8 చిరాకు పెట్టిస్తున్న బిగ్ బాస్ 8
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో 11 వారాలు పూర్తి కావడానికి మరో రెండు రోజుల సమయమే ఉంది. ఈ సీజన్ మొదటి నుంచి బోర్ కొడుతోంది అంటూ బుల్లితెర ప్రేక్షకులు గోల పెడుతూనే ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చాక కూడా హౌస్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ డెవలెప్మెంట్ లేదు. వారం వారం బోరింగ్ నామినేషన్స్, చూసిన టాస్క్ లే పదే పదే ఇవ్వడం ఇవ్వన్నీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. 

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు తో ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యింది. హౌస్లో ఉన్న నబీల్, రోహిణి, నిఖిల్, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ పేరెంట్స్ రాగా, అవినాష్ వైఫ్, ప్రేరణ హస్బెండ్ వచ్చారు. అయితే హౌస్ లోకి ఎవరి పేరెంట్ వచ్చినా టేస్టి తేజ ఏడ్చి ఏడ్చి చిరాకు పెట్టించాడు. నిన్నగాక మొన్న హౌస్ లోకి వచ్చి అంత ఎమోషన్ అవుతున్నాడేమిటి అనుకున్నారు. మరోపక్క హౌస్ లో బ్యాడ్ కంటెస్టెంట్ అయినందుకు వలన తేజ పేరెంట్స్ హౌస్ లోకి రారని బిగ్ బాస్ చెప్పారు. కానీ హౌస్ లోకి టేస్టీ తేజ వాళ్ళ అమ్మను పంపించారు. 

ఇక ఈ వారం విష్ణు ప్రియా హౌస్ ని వీడేలా కనబడుతుంది. ఆమె ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది. ఇక హౌస్ లోకి వచ్చిన నిఖిల్ మదర్ యష్మి ని అవాయిడ్ చెయ్యడం అందరిలో ఆసక్తిని రేకెత్తించినా నిఖిల్ తీరు మరకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఏది ఏమైనా ఈ సీజన్ మాత్రం బుల్లితెర ప్రేక్షకులను చిరాకు పెట్టిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. 

Annoying Bigg Boss 8:

Bigg Boss 8 update 

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ