Advertisementt

BB 8: విష్ణు ప్రియపై ట్రోలింగ్

Fri 15th Nov 2024 03:59 PM
vishnupriya  BB 8: విష్ణు ప్రియపై ట్రోలింగ్
Bigg Boss Telugu 8: Vishnupriya Gets Trolled BB 8: విష్ణు ప్రియపై ట్రోలింగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లోకి టైటిల్ ఫెవరేట్ గా దిగిన విష్ణు ప్రియా చెత్త ఆట ప్రేక్షకులకు నచ్చడం లేదు. బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ చూపిస్తే క్రేజ్ వస్తుంది అని విష్ణు ప్రియా ప్లాన్డ్ గా పృథ్వీ ని లైన్ లో పెట్టింది. సోనియా ఉన్న సమయంలో విష్ణు ప్రియా ఉడికిపోయేది. పృథ్వీ ఎక్కువగా సోనియా చుట్టూ తిరుగుతున్నాడని కుళ్ళుకునేది.

సోనియా వెళ్లిపోయాక మెల్లగా ట్రాక్ కలిపి పృథ్వీ కి దగ్గరైనా.. అది గేమ్ కోసమే అని హౌస్ మేట్స్ ఫిక్స్ అయ్యారు. తన బిహేవియర్ తో బుల్లితెర ఆడియన్స్ చేతిలో తిట్లు తింటుంది. అంతేకాదు ఆమె అభిమానులకే విష్ణు ప్రియా లవ్ ట్రాక్ నచ్చలేదు, అదే విషయాన్నీ ఫ్యామిలీ వీక్ లో వచ్చిన విష్ణు ప్రియా తండ్రి చెప్పాడు. నీ ట్రాక్ ఫ్యాన్స్ కు నచ్చలేదు అని.

అంతేకాదు ఆయన ఈ హౌస్ కోసమే పృథ్వీ తో అనగానే లేదు లేదు ఇష్టం ఉంది కానీ అది లవ్ కాదు. ఇక్కడ నాకు సపోర్ట్ కావాలి. అది పృథ్వీ దగ్గర దొరికింది. అయినా ఇక్కడ ఇన్ని కెమెరాల మధ్యన ఏం చేస్తాం కేవలం మాట్లాడుకోవడం తప్ప అంటూ విష్ణు ప్రియా వాగిన చెత్త వాగుడికి సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివిటి పెరిగేలా చేసింది. విష్ణు ప్రియా ఓ పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద ఉండి ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతావా అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

ఈ సీజన్ లో యష్మి నిఖిల్ తో ఫ్రెండ్ షిప్ వలన, సోనియా పృథ్వీ, నిఖిల్ ఫ్రెండ్ షిప్ వలన, విష్ణు ప్రియా-పృథ్వీ ట్రాక్ తో వాళ్ళ ఇమేజ్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యింది. 

Bigg Boss Telugu 8: Vishnupriya Gets Trolled:

Bigg Boss Telugu 8: Vishnupriya Gets Trolled After Family Week

Tags:   VISHNUPRIYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ