Advertisementt

BB 8: ప్రేరణను ఏడిపించి సర్ ప్రైజ్ ఇచ్చారు

Fri 15th Nov 2024 12:44 PM
prerana  BB 8: ప్రేరణను ఏడిపించి సర్ ప్రైజ్ ఇచ్చారు
Prerana husband entered into Bigg Boss house BB 8: ప్రేరణను ఏడిపించి సర్ ప్రైజ్ ఇచ్చారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. గత మూడు రోజులుగా హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ హౌస్ లోకి అడుగుపెట్టి సందడి చేస్తున్నారు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి రోహిణి తల్లి వచ్చారు, ఆతర్వాత వరసగా నిఖిల్ తల్లి, అవినాష్ వైఫ్ అనుజా, పృథ్వీ తల్లి, విష్ణు ప్రియా తండ్రి, యష్మి తండ్రి, గౌతమ్ అన్న అందరూ వచ్చారు. 

ఇక ఏ ఫ్యామిలీ మెంబెర్ హౌస్ లోకి వచ్చినా టేస్టీ తేజ మాత్రం తాను ఫ్యామిలీ వీక్ లో తన తల్లిని మిస్ అవుతున్నందుకు తెగ ఏడుస్తున్నాడు. వరెస్ట్ కంటెండర్ గా హౌస్ మేట్స్ తేల్చడంతో టేస్టీ తేజ ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చే అవకాశం కోల్పోయినట్లుగా బిగ్ బాస్ చెప్పాడు. దానితో తల్లిని హౌస్ లోకి తీసుకురావాలనే కోరిక తీరలేదని తేజ ఏడుస్తున్నాడు. 

ఇక ప్రేరణ భర్త శ్రీపాద అందుబాటులో లేను అంటూ వీడియో ఇవ్వగా బిగ్ బాస్ శ్రీపాద కటౌట్ పంపించి ప్రేరణను సరిపెట్టుకోమన్నారు. అంతేకాదు ఫ్యామిలీ వీక్ ముగిసింది అనగానే ప్రేరణ ఎమోషనల్ అయ్యింది. బాగా ఏడ్చింది. ప్రేరణను ఏడిపించి బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు ఎపిసోడ్ లో ప్రేరణ భర్త శ్రీపాద హౌస్ లో రావడంతో ఆ మూమెంట్ ను బ్యూటిఫుల్ గా ప్లాన్ చేసి ప్రేరణ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన ప్రోమో వైరల్ అయ్యింది. 

Prerana husband entered into Bigg Boss house:

Prerana husband Sripad entered into Bigg Boss Telugu 8

Tags:   PRERANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ