Advertisementt

మహేష్-ప్రభాస్ లలో ఎవరు పోటీ : బన్నీ ఆన్సర్

Fri 15th Nov 2024 12:04 PM
balakrishna  మహేష్-ప్రభాస్ లలో ఎవరు పోటీ : బన్నీ ఆన్సర్
Who is Mahesh-Prabhas competition : Bunny Answer మహేష్-ప్రభాస్ లలో ఎవరు పోటీ : బన్నీ ఆన్సర్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే పుష్ప ద రూల్ తో మరో సెన్సేషన్ కి సిద్దమవుతున్నాడనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న సారధి స్టూడియోస్ లో వేసిన సెట్ లో పుష్ప షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న సుకుమార్, అల్లు అర్జున్ లు.. అప్పుడే పుష్ప 2 ప్రమోషన్స్ మొదలెట్టేసారు. రేపటి తో పుష్ప ద రూల్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. 

ఈ ఆదివారం పాట్నా లో జరగబోయే పుష్ప2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అల్లు అర్జున్-సుక్కు ఇంకా టీం మొత్తం హాజరవుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో అందరి చూపు తనవైపు తిప్పుకునేలాంటి సమాధానాలతో అందరిని ఇంప్రెస్ చేస్తున్నారు. గత రాత్రి నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈ ఎపిసోడ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. 

అల్లు అర్జున్ నీకు మహేష్, ప్రభాస్ లలో ఎవరు పోటీ అనుకుంటున్నావు అని బాలకృష్ణ అడగగానే. దానికి అల్లు అర్జున్ ఇచ్చిన ఆన్సర్ తో అల్లు అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేసాయి. నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే.. ఐ యామ్ బిగ్గెస్ట్ కాంపిటీషన్ అంటూ అల్లు అర్జున్ కాన్ఫిడెంట్ తో చెప్పిన ఆన్సర్ వైరల్ అయ్యింది. 

అదే మహేష్ పేరో, లేదంటే ప్రభాస్ పేరో చెబితే ఇద్దరిలో ఎవరో ఒకరి ఫ్యాన్స్ అయితే డిజప్పాయింట్ అయ్యేవారు, పుష్ప 2 పై ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడేది, అసలే ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు కదా.. 

Who is Mahesh-Prabhas competition : Bunny Answer:

Balakrishna-Allu Arjun Unstoppable S4 episode highlights

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ