Advertisementt

రకుల్ లుక్ పై విమర్శలు

Thu 14th Nov 2024 02:16 PM
rakul preet  రకుల్ లుక్ పై విమర్శలు
Criticism on Rakul Preet new look రకుల్ లుక్ పై విమర్శలు
Advertisement
Ads by CJ

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొన్నేళ్లుగా సినిమా కబుర్లతో కన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్ తోనే వార్తల్లో నిలుస్తుంది. మొదటి నుంచి గ్లామర్ షోకే ప్రాధాన్యతనిచ్చే రకుల్ ప్రీత్ ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపించేది. బాలీవుడ్ నీళ్లు ఒంటబట్టాక జీరో సైజ్ లోకి మారిపోయింది. ఆమె అందం కాస్త తరిగిపోయిన ఫీలింగ్ అభిమానులకే వచ్చింది. 

కానీ రకుల్ ప్రీత్ మాత్రం లావుగా ఉంటే లావుగా ఉంది, బరువు తగ్గితే బాలేదు అంటారు. అంతా మీ ఇష్టమేనా అని ఫైర్ అయ్యేది. ఏది ఏమైనా రకుల్ ప్రీత్ సన్నబడి మరీ బక్కగా తయారైంది. ఆమె గ్లామర్ ఫోటో షూట్స్ వదిలినప్పుడు ఆమె అందాలను పొగుడుతున్నా ఆమె తగ్గిన బరువు పై కామెంట్స్ వెయ్యకుండా ఉండలేకపోతున్నారు నెటిజెన్స్. 

తాజాగా రకుల్ ప్రీత్ బ్లాక్ డ్రెస్ ఫోటో షూట్ పోస్ట్ చేసింది. అందులో రకుల్ మరీ చీపురు పుల్లలా ఉంది అనే మాట నెటిజెన్స్ నుంచి వ్యక్తమవుతోంది. టైట్ ఫిట్ ఓకె కానీ.. మరీ సన్నగా కనిపించిన రకుల్ పై నెటిజెన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏంటి రకుల్ స్కెలిటన్ లా తయారయ్యావ్ అంటూ వెటకారంగా కామెంట్స్ పెడుతున్నారు. 

Criticism on Rakul Preet new look:

Rakul Preet Singh black lace outfit new look

Tags:   RAKUL PREET
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ