Advertisementt

వరుణ్ తేజ్ మట్కా ఓవర్సీస్ టాక్

Thu 14th Nov 2024 11:06 AM
varun tej  వరుణ్ తేజ్ మట్కా ఓవర్సీస్ టాక్
Varun Tej Matka Overseas Talk వరుణ్ తేజ్ మట్కా ఓవర్సీస్ టాక్
Advertisement
Ads by CJ

క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మట్కా నేడు నవంబర్ 14 న భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్ లో ఇప్పటికే షోస్ కంప్లీట్ చేసుకుంది. మరి సినిమా చూసి ఆడియన్స్ ఊరికే ఉండరుగా.. మట్కా ఓవర్సీస్ టాక్ అంటూ హడావిడి మొదలు పెట్టారు. 

మట్కా టాక్ లోకి వెళితే.. మ‌ట్కా వాసుగా మూడు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్‌తేజ్ నటనకు ఫుల్ మార్కులివ్వొచ్చు. ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, ల‌వ్ స్టోరీ మిక్స్ చేస్తూ ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్ మ‌ట్కా ని తెరకెక్కించాడు. మట్కా ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. వరుణ్ తేజ్ తన కెరీర్‌లో బెస్ట్ ఫెర్పార్మెన్స్‌ను ఇచ్చాడు అంటూ కొంతమంది ఆడియన్స్ చెబుతున్న మాట. 

అయితే కాన్సెప్ట్ బాగున్నా తాను అనుకున్న క‌థ‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చెయ్యడంలో డైరెక్ట‌ర్ సక్సెస్ అవ్వలేదు, అంతేకాదు స్క్రీన్‌ప్లే రొటీన్‌గా ఉండ‌టం, ట్విస్ట్‌లు మొత్తం ప్రెడిక్ట‌బుల్‌గా సాగ‌డం సినిమాకు మైన‌స్, వీటికి తోడు జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ బిగ్గెస్ట్ మైన‌స్ అంటూ మాట్లాడుతున్నారు. 

ఇక హీరోయిన్లు మీనాక్షి చౌద‌రి, నోరా ఫ‌తేహి పాత్ర‌ల‌కు అస్సలు ఇంపార్టెన్స్ లేదు, కేవలం సాంగ్స్ అలాగే కొన్ని సీన్స్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యార‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ వేస్తున్నారు.. మరి మట్కా ఫైనల్ రిజల్ట్ ఏమిటో మరికాసేపట్లో పూర్తి రివ్యూలో చూసేద్దాం. 

Varun Tej Matka Overseas Talk:

Varun Tej Matka Twitter Talk

Tags:   VARUN TEJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ