Advertisementt

BB8: నిఖిల్ ని తొక్కేస్తున్న డాక్టర్ సాబ్

Thu 14th Nov 2024 10:19 AM
nikhil  BB8: నిఖిల్ ని తొక్కేస్తున్న డాక్టర్ సాబ్
BB8: Goutham vs Nikhil BB8: నిఖిల్ ని తొక్కేస్తున్న డాక్టర్ సాబ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 8 లో టాస్క్ ల పరంగా కన్నడ యాక్టర్ నిఖిల్ మొదటి నుంచి నెంబర్ 1 గానే కనిపిస్తున్నాడు. ఏ టాస్క్ ఇచ్చినా ఓడిపోడు, గెలిచి చూపిస్తాడు. కాబట్టే బుల్లితెర ఆడియన్స్ నిఖిల్ ని ఇష్టపడ్డారు. సోనియా ఎపిసోడ్ లో కూడా నిఖిల్ తప్పు కన్నా ఎక్కువగా అక్కడ సోనియా మిస్టేక్ కనిపించడంతో నిఖిల్ ని బిగ్ బాస్ ఆడియన్స్ లైక్ చేసారు. 

నిఖిల్ నామినేషన్స్ లోకి వస్తే అతనికొచ్చే ఓట్స్ ఎవ్వరికి మ్యాచ్ అయ్యేవి కాదు. ఓటింగ్ లో ఎప్పుడు ముందుండేవాడు. కానీ ఇపుడు నిఖిల్ గ్రాఫ్ ని అశ్వద్ధామ 2.ఓ అదేనండి డాక్టర్ గౌతమ్ తొక్కేస్తున్నాడు. వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ సీజన్ 7 కన్నా ఎక్కువ అగ్రెస్సివ్ గా సీజన్ 8 లోకి వచ్చాడు. అందరితో తాడో పేడో తేల్చుకునే గౌతమ్ కన్నడ బ్యాచ్ ని ఢీ కొట్టాడు. 

నిఖిల్, ప్రేరణ, యష్మి, నిఖిల్ వీళ్లంతా సీరియల్స్ బ్యాచ్. వీళ్ళు ఇప్పటివరకు స్ట్రాంగ్ గానే ఉన్నారు. కానీ గౌతమ్ వీళ్ళను ఢీ కొట్టాడు. ప్రేరణ తో సీతాఫలాలు పంచాయితీ, యష్మి తో అక్క గొడవ, నిఖిల్, పృథ్వీ లలో టాస్క్ ల్లో గొడవ ఇలా వాళ్ళ ముసుగు తీసేస్తున్నాడు. దానితో గౌతమ్ స్ట్రాంగ్ అయ్యాడు. 

గత వారం నుంచి నామినేషన్స్ లోకి వస్తున్న గౌతమ్, నిఖిల్ లు పోటాపోటీగా ఓట్లు కొల్లగొడుతున్నారు అనుకుంటే పొరబాటే.. నిఖిల్ కన్నా ఎక్కువగానే గౌతమ్ ఓట్లు సాధిస్తున్నాడు. ఈవారం కూడా నామినేషన్స్ లోకి వచ్చిన గౌతమ్.. నిఖిల్ ని తొక్కేసి మరీ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మరి డాక్టర్ సాబ్ మామూలోడు కాదురోయ్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

BB8: Goutham vs Nikhil:

Bigg Boss 8: Nikhil vs Gowtham

Tags:   NIKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ