Advertisementt

కంగువ ప్రీమియర్ షో టాక్

Thu 14th Nov 2024 08:39 AM
kanguva  కంగువ ప్రీమియర్ షో టాక్
Kanguva Premiere Show Talk కంగువ ప్రీమియర్ షో టాక్
Advertisement
Ads by CJ

విలక్షణ నటుడు సూర్య నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం కంగువ. శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుంది అని కంగువ పోస్టర్స్, ట్రైలర్స్ తోనే పరిచయం చేసారు. సూర్య-శివ కంగువ కి చేసిన ప్రమోషన్స్ ఈ చిత్రం పై అందరిలో విపరీతమైన అంచనాలు పెంచింది. నేడు నవంబర్ 14 న కంగువ గ్రాండ్ గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో కంగువ షోస్ కంప్లీట్ కావడంతో ఓవర్సీస్ ఆడియన్స్ స్పందన అంటూ సోషల్ మీడియాలో కంగువ ట్విట్టర్ రివ్యూస్ బయటికి వచ్చేశాయి. 

వందల ఏళ్ళ క్రితం కొన్ని దీవుల్లో ఉండే ట్రైబల్ విలేజ్ ల నేపథ్యంలో కంగువ కథ ప్రారంభం అవుతుంది. సూర్య కంగువగా పవర్ ఫుల్ ఎంట్రీ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ. సూర్య ఎంట్రీ తోనే అదిరిపోయే యాక్షన్ సీన్ దానికి తగిన దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. కథ మంచి పట్టుతో ఉత్కంఠ భరిత సన్నివేశాలతో ఇంటర్వెల్ వైపు వెళుతుంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, ఫ్లాష్ బ్యాక్ స్టోరి కొంత స్లో గా అనిపిస్తుంది.. కానీ సూర్య యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు అంటూ కంగువ వీక్షించిన ఓ ఆడియెన్ కామెంట్ చేసాడు. 

కంగువ ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. సినిమాలోని ప్రారంభంలో వచ్చే కొన్ని బ్లాక్స్ బాగున్నాయి. కథ నడింపించిన విధానం ఫస్ట్ హాఫ్ కి మైనస్. కొన్ని సీన్లు విసుగు తెప్పించేలా ఉంటాయి, దేవిశ్రీ  BGM కూడా అక్కడక్కడా వర్కౌట్ అయ్యింది అంటూ మరో ప్రేక్షకుడి మాట. 

పర్ఫెక్ట్ ఇంటర్వెల్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. కంగువ పాత్రలో సూర్య బాగున్నాడు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి శివ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో విఫలం అయ్యారు. ఆడియన్స్ సహనానికి సెకండ్ హాఫ్ పరీక్ష అన్నట్లుగా కనిపిస్తుంది. దేవిశ్రీ కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా ఇచ్చిన BGM మరికొన్ని సన్నివేశాల్లో వాయించేసాడు అనిపిస్తుంది. విజువల్ పరంగా బావున్న ఈ చిత్రం స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా బిలో యావరేజ్ చిత్రంగా నిలుస్తుంది.. అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ కంగువ చూసి ఇస్తున్న రెస్పాన్స్. 

మరి ఇక్కడ పాన్ ఇండియా ప్రేక్షకులు కంగువ చూసి ఎలాంటి కామెంట్స్ చేస్తారో, ఫైనల్ గా కంగువ రిజల్ట్ ఏమిటి అనేది పూర్తి రివ్యూ తో మరికాసేపట్లో.. 

Kanguva Premiere Show Talk:

Kanguva Overseas Talk

Tags:   KANGUVA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ