Advertisementt

బిగ్ బాస్ 8: యష్మి ని కంట్రోల్ చెయ్ నిఖిల్

Wed 13th Nov 2024 10:14 PM
nikhil  బిగ్ బాస్ 8: యష్మి ని కంట్రోల్ చెయ్ నిఖిల్
Bigg Boss 8: Nikhil controls Yashmi బిగ్ బాస్ 8: యష్మి ని కంట్రోల్ చెయ్ నిఖిల్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇప్పటికే ఫ్యామిలీ వీక్ లో రోహిణి తల్లి, నబీల్ మదర్ వచ్చారు. ఈరోజు యష్మి తండ్రి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే యష్మి చాలా ఎమోషన్ అయ్యింది. తన తండ్రి ఎప్పడు ఇలా కంఫర్టబుల్ గా లేరు, కానీ ఈ హౌస్ కి వచ్ఛాక ఆయన నాతొ ఫస్ట్ టైం ఇలా ఉన్నారు అంటూ ఏడుస్తూనే ఉంది. 

ఇక ఆ తర్వాత నిఖిల్ మదర్ వచ్చారు. ఆమె చాలా స్మార్ట్ గా కొడుకు గేమ్ ఎలా ఉందొ చెప్పడం హైలెట్ అయ్యింది. G(గౌతమ్) జాగ్రత్తగా ఉండు అని తనకు పోటీ గౌతమ్ అనిహెచ్చరించారు. ఇక యష్మి కి నిఖిల్ పై ఉన్న ప్రేమ ప్రతి ఎపిసోడ్లో ఆడియన్స్ చూస్తున్నారు. నిఖిల్ మదర్ కూడా అదే చెప్పారు. Y (యష్మి ని) కంట్రోల్ చెయ్ అని చెప్పడంతోనే నిఖిల్-యష్మి హౌస్ లో ఎలా ఉన్నారో.. అది ఆడియన్స్ గమనిస్తున్నారని ఆమె నిఖిల్ కి స్మార్ట్ గా అర్ధమయ్యేలా చెప్పారు. 

ఇక P (ప్రేరణ)తో కూడా జాగ్రత్తగా ఉండు, ఆమె చాలా డీప్ గా తీసుకుంటుంది అంటూ నిఖిల్ తల్లి అతన్ని హెచ్చరించిన తీరు భలే స్మార్ట్ గా అనిపించకమానదు. ఇక నువ్వు ఇండివిడ్యువల్ గా ఆడు, ఎవ్వరి కోసం ఆడకు అంటూ ఆమె పదే పదే కొడుకుని హెచ్చరించడం చూసి యష్మి ని దూరం పెట్టమని కొడుక్కి నూరిపోసింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Bigg Boss 8: Nikhil controls Yashmi:

Bigg Boss 8: Nikhil mother avoids Yashmi

Tags:   NIKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ