Advertisementt

యష్ టాక్సిక్ టీమ్ పై లీగల్ కేసు

Wed 13th Nov 2024 05:42 PM
yash  యష్ టాక్సిక్ టీమ్ పై లీగల్ కేసు
Yash Toxic in trouble యష్ టాక్సిక్ టీమ్ పై లీగల్ కేసు
Advertisement
Ads by CJ

కేజిఫ్ పార్ట్ 1, పార్ట్  2 లతో పాన్ ఇండియాలో సెన్సేషనల్ హీరోగా మారిన కన్నడ హీరో యష్ కెజిఫ్ తర్వాత బిగ్ బ్రేక్ తీసుకుని టాక్సిక్ మూవీ మొదలు పెట్టారు. ఈ చిత్రంలో ముందుగా యష్ సిస్టర్ గా కరీనా కపూర్ ఫిక్స్ అవ్వగా.. ఆమె ఆ కేరెక్టర్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత టాక్సిక్ లోకి నయనతార ఎంటర్ అయ్యింది. 

టాక్సిక్ మూవీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈమధ్యన టాక్సిక్ మూవీ కోసం వేలాదిగా చెట్లు కొట్టేశారనే ఆరోపణలు తలెత్తాయి. అవి ఆరోపణలు కాదు నిజం అని కర్ణాటక అటవీ శాఖ టాక్సిక్ యూనిట్ పై కేసు నమోదు చేసింది. బెంగుళూరు లోని పీణ్య-జలహళ్లి సమీపంలో టాక్సిక్ షూటింగ్ చేస్తున్నారు. 

అక్కడ షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు తీసుకున్న టాక్సిక్ బృందం షూటింగ్ కోసం సెట్స్ వేసుకునే క్రమంలో ఆ అడవిలోని వేలాది చెట్లని నరకడంతో అటవీశాఖ మంత్రి ఆ ప్రాంతాన్ని పర్యటించి ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం వివాదాస్పదం అయ్యింది. అనుమతి లేకుండా చెట్లని నరకడం నేరమంటూ మినిస్టర్ టాక్సిక్ బృందం పై ఫైర్ అయ్యారు. 

ఇది జరిగిపోయిన చాలా రోజులకి అటవీశాఖ టాక్సిక్ బృందం పై కేసు పెట్టింది. షూటింగ్ ల కోసం చెట్లను నరకడం నేరమని, టాక్సిక్ మేకర్స్ అలాగే భూమిని లీజుకి ఇచ్చిన వారిపై కూడా అటవీశాఖ కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.  

Yash Toxic in trouble:

Yash Toxic surrounded by legal trouble

Tags:   YASH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ