సినిమా అవకాశాలు రాక.. టాలీవుడ్ ప్రముఖులపై ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసి.. తనని సినిమా ఇండస్ట్రీ పక్కనపెట్టేసేలా చేసుకున్న నటి శ్రీ రెడ్డి. ఆ తర్వాత రాజకీయం అంటూ వైసీపీ ప్రభుత్వంతో లాలూచి పడింది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కి కక్కుర్తి పడి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ కి తొత్తుగా మారింది.
కేవలం చంద్రబాబు లాంటి వాళ్లపైనే కాదు టీడీపీ నేతలైన అచ్చెన్న, అయ్యన్న పాత్రుడు ఇలా ఎవ్వర్నీ వదలకుండా నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయింది. అడ్డుఅదుపు లేకుండా వీడియోస్ వదిలింది. కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ పై రివర్స్ అయ్యింది. వైసీపీ కార్యకర్తలను జగన్ పట్టించుకోవడం లేదు, మేము బ్లడ్ పెట్టి పని చేసాం, కానీ మాకు జీతాలివ్వలేదు అని రోడ్డెక్కింది.
ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో వైసీపీ యాక్టీవిస్టులుగా పని చేసిన వారిని వదలకుండా అరెస్ట్ చేస్తుంది. ఇప్పటికే వర్ర రవీంద్ర రెడ్డి, ఇంటూరి రవి కిరణ్, బోరుగడ్డ అనిల్ ని అరెస్ట్ చెయ్యగా, రామ్ గోపాల్ వర్మ, పోసానిలకు నోటీసులు ఇచ్చింది. అప్పటికే శ్రీ రెడ్డి చంద్రబాబు, పవన్, లోకేష్ లకు క్షమాపణలు చెప్పింది. అయితే మాత్రం కూటమి ప్రభుత్వం వదులుతుందా, శ్రీ రెడ్డి పై టీడీపీ నేత పద్మ ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకుని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసేలా చేసింది. అంతేకాదు ఆమెకు నోటీసులు కూడా పంపింది.